Published : 14 Mar 2022 09:53 IST

Virat Kohli: కోహ్లీకి వింత అనుభవం.. స్టేడియంలోకి పరుగెత్తుకొచ్చి అభిమానుల సెల్ఫీలు

బెంగళూరు: శ్రీలంకతో జరుగుతోన్న పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి వింత అనుభవం ఎదురైంది. రెండో రోజు ఆటలో ఆదివారం రాత్రి మూడో సెషన్‌ జరుగుతుండగా కోహ్లీ తొలి స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో ముగ్గురు అభిమానులు ఒక్కసారిగా సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి పరుగెత్తుకొచ్చారు. వాళ్లు నేరుగా కోహ్లీ వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. అయితే, విరాట్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా దూరంగా ఉన్నాడు. బయోబబుల్‌లో ఉన్నందున తనని ముట్టకుండా సెల్ఫీలు తీసుకోమన్నాడు. దీంతో ఇద్దరు యువకులు కోహ్లీతో ఫొటోలు క్లిక్‌మనిపించారు. మరో అభిమాని అతడి వద్దకు వచ్చేసరికి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి వారిని వెళ్లగొట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. మీరూ ఒకసారి చూసి సరదాగా ఎంజాయ్‌ చేయిండి.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని