Viral Video: ఇలాంటి క్యాచ్‌.. మీరెప్పుడూ చూసి ఉండరు..!

క్రికెట్‌లో అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి అవి కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా విలేజ్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో అచ్చం అలాంటి సంఘటనే జరిగింది...

Published : 17 Jun 2022 08:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి అవి కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా విలేజ్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఇంగ్లాండ్‌లోని అల్‌డ్విక్‌ క్రికెట్‌ క్లబ్‌, లింగ్‌ఫీల్డ్ క్రికెట్‌ క్లబ్‌ జట్ల మధ్య గురువారం ఓ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా అల్‌డ్విక్‌ జట్టుకు చెందిన అలెక్స్‌ రైడర్‌ అనే 16 ఏళ్ల యువ బౌలర్‌ విసిరిన ఓ బంతిని బ్యాట్స్‌మెన్‌ గాల్లోకి ఆడాడు. ఆ బంతి బౌలర్‌ దగ్గరకే రావడంతో దాన్ని క్యాచ్‌ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అదే సమయంలో అతడు వెనక్కి పడిపోవడంతో క్యాచ్‌ చేజారి బంతి కిందపడేలా కనిపించింది. అయితే, అప్పుడు ఆ బంతి బౌలర్‌ కుడి కాలుకు తాకి మళ్లీ గాల్లోకి లేచింది. దీంతో రెండోసారి వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకొని మళ్లీ క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. దీంతో అలెక్స్‌ ఊహించని విధంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేశాడు. ఈ క్యాచ్‌ను చూసిన తోటి ఫీల్డర్లు సైతం అలెక్స్‌ అద్భుతాన్ని నమ్మలేకపోయారు. దీంతో ఆ బ్యాట్స్‌మన్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నిరాశగా వెనుదిరిగాడు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని