
Gujarat: రషీద్ ఆఖరి బంతికి సిక్సర్.. గుజరాత్ ఆటగాళ్ల సంబరాలు చూడండి
(Photo: Rashid Khan Instagram)
ముంబయి: హైదరాబాద్‌తో గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఆఖరి బంతికి ఉత్కంఠభరితమైన విజయం అందుకోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు సంతోషంలో మునిగితేలారు. హైదరాబాద్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు అద్భుతంగా పోరాడింది. దీంతో చివరికి ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో (14 పాయింట్లు) అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఆఖరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 22 పరుగులు అవసరమైన వేళ.. రాహుల్ తెవాతియా (40 నాటౌట్; 21 బంతుల్లో 4x4, 2x6), రషీద్ ఖాన్ (31 నాటౌట్; 11 బంతుల్లో 4x4) దంచికొట్టారు.
మార్కో జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో.. తెవాతియా తొలి బంతికి సిక్సర్ బాది రెండో బంతికి సింగిల్ తీశాడు. తర్వాత రషీద్ మూడో బంతిని సిక్సర్‌గా మలచడంతో చివరి మూడు బంతుల్లో ఆ జట్టు విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. అయితే, రషీద్ నాలుగో బంతిని వదిలేయడంతో ఉత్కంఠ తార స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా సంధించడంతో గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఓడిపోతామనుకున్న మ్యాచ్ గెలవడంతో డగౌట్‌లోని గుజరాత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు. అలాగే మైదానంలోని తెవాతియా, రషీద్ సైతం విజయోత్సాహంలో మునిగిపోయారు. ఆ వీడియోను టోర్నీ నిర్వాహకులు ట్విటర్‌లో పోస్టు చేశారు. అది మీరూ చూసి ఆనందించండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: అలియా అలా.. విష్ణుప్రియ ఇలా.. ‘రంగుల’ హొయలు భళా!
-
Business News
Service charge: సర్వీసు ఛార్జీ వసూలు చేయొద్దు.. హోటల్స్, రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు!
-
Sports News
IND vs ENG: దూకుడు తగ్గించని ఇంగ్లాండ్ ఓపెనర్లు.. వంద దాటిన స్కోరు
-
India News
CBSE 10th Result: సీబీఎస్ఈ ‘పది’ ఫలితాలు ఇప్పుడే కాదు..!
-
Crime News
Crime News: ఓఆర్ఆర్పై ప్రమాదం.. ముగ్గురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
-
General News
Harish Rao: విద్యార్థులకు త్వరలో ఉపకార వేతనాలు.. వెంటనే అందించాలని మంత్రి ఆదేశం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు