Team India U19: 2011లో ధోనీలాగే సిక్సర్‌తో ముగించిన దినేశ్‌ బానా

టీమ్‌ఇండియా 2011లో ముంబయి వాంఖడే మైదానంలో రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. నాటి కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (91; 79 బంతుల్లో 8x4, 2x6) విరోచిత బ్యాటింగ్‌తో...

Updated : 06 Feb 2022 13:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా 2011లో ముంబయి వాంఖడే మైదానంలో రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. నాటి కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (91 నాటౌట్‌; 79 బంతుల్లో 8x4, 2x6) విరోచిత బ్యాటింగ్‌తో చివరికి సిక్సర్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ అద్భుత క్షణాలను భారత క్రీడా అభిమానులెవ్వరూ మర్చిపోరు. ఆ అపురూప దృశ్యం ఇంకా ప్రతి ఒక్కరి కళ్లముందు కదలాడుతూనే ఉంది. అయితే, అచ్చం అలాంటి సంఘటనే ఇప్పుడు అండర్‌-19 ప్రపంచకప్‌లోనూ పునరావృతమైంది. టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ బానా (13 నాటౌట్‌ ; 5 బంతుల్లో 2x6) గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో సిక్సర్‌తోనే విజయాన్ని అందించాడు. దీంతో ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న ఐసీసీ.. 2011లో ధోనీ బాదిన సిక్సర్‌ను కూడా అందులో జతచేసింది. ఇప్పుడది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. మీరూ ఆ వీడియోను చూసి ఎంజాయ్‌ చేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని