Team India U19: ఆది నుంచీ యువ భారత్‌దే పైచేయి.. ఫైనల్‌ మ్యాచ్‌ హైలైట్స్‌..

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పటివరకూ ఏ జట్టుకూ సాధ్యంకాని విధంగా రికార్డు స్థాయిలో ఐదోసారి జగజ్జేతగా నిలిచింది...

Published : 06 Feb 2022 09:19 IST

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పటివరకూ ఏ జట్టుకూ సాధ్యంకాని విధంగా రికార్డు స్థాయిలో ఐదోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌.. టీమ్‌ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశిద్దామనుకుంది. కానీ, భారత బౌలర్లు రవికుమార్‌ (4/34), రాజ్‌ బవా (5/31) ధాటికి ఆ జట్టు 189 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్‌ జట్టు ఆశలకు గండిపడింది. అనంతరం యువ భారత్‌ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకోగా.. ఆంధ్రా కుర్రాడు షేక్‌ రషీద్‌ (50; 84 బంతుల్లో 6x4), నిషాంత్‌ సింధు (50; 54 బంతుల్లో 5x4, 1x6) అర్ధ శతకాలతో సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి జట్టుకు ఘన విజయం అందించారు. కాగా, ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్స్‌ వీడియో ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. మీరూ భారత కుర్రాళ్లు ఎలా రాణించారో ఓసారి చూసి ఆనందించండి.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని