IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో...
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు సారథి బెన్‌స్టోక్స్ (25; 36 బంతుల్లో 4x4) ఆడిన షాట్‌ను క్యాచ్ అందుకున్నాడు. శార్దూల్ వేసిన 38వ ఓవర్ నాలుగో బంతికి స్టోక్స్ బౌండరీ కొట్టే ప్రయత్నం చేయగా.. దూరంగా వెళ్తున్న బంతిని బుమ్రా అమాంతం గాల్లోకి డైవ్ చేస్తూ రెండు చేతులతో ఒడిసిపట్టాడు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ పెవిలియన్ చేరగా.. బెయిర్ స్టోతో కలిసి అతడు నిర్మించిన 66 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ ట్విటర్లో పంచుకొని బుమ్రాను మెచ్చుకుంది. మీరూ ఆ క్యాచ్ ఎలా పట్టాడో చూసి ఆస్వాదించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్