Jos Buttler: ఇలాంటి బంతిని కూడా వదలని బట్లర్‌.. సిక్సర్‌తో దంచేశాడు

ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో రాజస్థాన్‌ ఓపెనర్‌గా చెలరేగిన అతడు తాజాగా నెదర్లాండ్స్‌తో...

Published : 23 Jun 2022 12:21 IST

(Photo: England Cricket Board Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌ టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో రాజస్థాన్‌ ఓపెనర్‌గా చెలరేగిన అతడు తాజాగా నెదర్లాండ్స్‌తో ఆడిన వన్డే సిరీస్‌లోనూ పరుగుల వరద పారించాడు. తొలి వన్డేలో 162 నాటౌట్‌ పరుగులు చేసి ఇంగ్లాండ్‌ జట్టు చరిత్రాత్మక స్కోర్‌ 498/4 చేయడంతో కీలకపాత్ర పోషించాడు. తాజాగా బట్లర్‌ మరోసారి బ్యాట్‌ ఝుళిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బట్లర్‌ ఆడిన ఒక బంతి ఇప్పుడు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తోంది.

ఆమ్‌స్టల్‌వీన్‌ వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డేలో నెదర్లాండ్స్‌ నిర్దేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయి 30.1 ఓవర్లలో ఛేదించింది. జేసన్‌ రాయ్‌ (101; 86 బంతుల్లో 15x4), బట్లర్‌ (86‌; 56 బంతుల్లో 7x4, 5x6) నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను గెలిపించారు. ఈ క్రమంలోనే బట్లర్‌ ఓ విచిత్రమైన బంతికి సిక్సర్‌ బాదడం గమనార్హం. ఇన్నింగ్స్‌ 29వ ఓవర్‌లో పాల్‌ మీక్రెన్‌ ఒక బంతిని బౌన్సర్‌గా వేద్దామని చూడగా అది రెండు స్టెప్పులు పడింది. మొదటిసారి పిచ్‌మీదే స్టెప్‌ అయిన బంతి రెండోసారి లెగ్‌సైడ్‌లో పిచ్‌ దాటి పడింది. దీంతో వెంటనే స్పందించిన బట్లర్‌ ఆ బంతి వద్దకెళ్లి దాన్ని అమాంతం సిక్సర్‌ బాదాడు. కాకపోతే అది నోబాల్‌గా ప్రకటించడంతో మరుసటి బంతిని కూడా అతడు సిక్సర్‌గా మలిచాడు. ఆ రెండు స్టెప్పుల బంతి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని