Indonesian MotoGP: వామ్మో.. బైక్‌ రేసింగ్‌లో ఒళ్లు గగుర్పొడిచే వీడియో

రేసింగ్ అంటేనే ప్రాణాలతో చెలగాటం ఆడటం. ముఖ్యంగా బైక్‌ రేసర్లకు ట్రాక్‌ మీద ఏ చిన్న తప్పు దొర్లినా అది ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంది...

Updated : 21 Mar 2022 14:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రేసింగ్ అంటేనే ప్రాణాలతో చెలగాటం ఆడటం. ముఖ్యంగా బైక్‌ రేసర్లకు ట్రాక్‌ మీద ఏ చిన్న తప్పు దొర్లినా అది ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంది. అచ్చం అదే జరిగింది మోటో గ్రాండ్‌ ప్రీలో  ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన మార్క్‌ మార్కెజ్‌ విషయంలో. ఆదివారం జరిగిన ఇండోనేషియన్‌ మోటోగ్రాండ్‌ ప్రీ తుదిపోరుకు ముందు మార్క్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడు గాయపడ్డాడు.

ఆదివారం ఉదయం ఏడో నంబర్‌ మలుపు వద్ద బైక్‌ అదుపుతప్పడంతో.. పల్టీలు కొడుతూ గాల్లో ఎగిరిపడ్డాడు. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అయితే, కిందపడిన వెంటనే తేరుకున్న మార్క్‌ పైకి లేచి నెమ్మదిగా నడిచివస్తూ కనిపించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా కంకషన్‌కు గురయ్యాడని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి ఫిట్‌నెస్‌తో లేని కారణంగా ఈ మాజీ ఛాంపియన్‌ ఇండోనేషియన్‌ మోటో గ్రాండ్‌ ప్రీ తుది పోరులో పాల్గొనలేక పోయాడు. మరోవైఫు ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ ఫాబియో క్వార్‌టారరోను.. మిగెల్‌ ఒలివీరా ఓడించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని