Sachin: ఆత్మీయుల కోసం చెఫ్‌గా మారిన సచిన్‌

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ చెఫ్‌గా మారాడు. తన ఆత్మీయుల కోసం ఏదో ప్రత్యేక వంటకం చేస్తూ వంటగదిలో బిజీ అయ్యాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని సంబరపడ్డాడు...

Published : 09 Jul 2021 20:42 IST

(Photo: Sachin Instagram Video Screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ చెఫ్‌గా మారారు. తన ఆత్మీయుల కోసం ఏదో ప్రత్యేక వంటకం చేస్తూ వంటగదిలో బిజీ అయ్యారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని సంబరపడ్డారు. తాను వండేది ఎవరికీ తెలియదని, తనకు కూడా అదేంటో తెలియదని తెందూల్కర్‌ చెప్పుకొచ్చారు.

‘అందరికీ ఇదో సర్‌ప్రైజ్‌. నేనేం వండుతున్నానో ఎవరికీ తెలియదు. నాక్కూడా తెలియదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేనీ విద్యలో ఆరితేరాను. ఏం చెయ్యాలో తెలుసుకున్నాను. ఇది తయారు చేయడానికి సమయం పడుతుంది’ అని పేర్కొంటూ సచిన్‌ ఆ వంటకాన్ని, తన నైపుణ్యాన్ని క్రికెట్‌ పదకోశంతో వివరించాడు. అయితే, అదేంటో.. ఎవరికోసం తయారు చేశారో మాత్రం మాస్టర్‌ బ్లాస్టర్‌ పేర్కొనలేదు.

కాగా, ఈ మధ్యే సచిన్‌ కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడుపుతూ ఖాళీ సమయంలో ఇలా తనకిష్టమైన పనులతో బిజీగా ఉంటున్నాడు. మరోవైపు తీరిక వేళ తన సహచర ఆటగాళ్లు యువరాజ్‌ సింగ్‌, అజిత్‌ అగార్కర్‌తో కలిసి గోల్ఫ్‌ ఆడుతూ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని