Published : 05 Jul 2022 01:59 IST

IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్‌.. వీడియో చూడండి

బర్మింగ్‌హామ్‌: టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను ఇంగ్లాండ్‌ రెండోసారి షాట్‌పిచ్‌ బంతితో బుట్టలో వేసింది. ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతోన్న ఐదో టెస్టులో అతడిని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అదే బంతితో పెవిలియన్‌ పంపింది. తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్‌ షాట్‌పిచ్‌ బంతికి వికెట్‌ కోల్పోయిన అయ్యర్‌ (15).. సోమవారం రెండో ఇన్నింగ్స్‌లోనూ 19 పరుగుల వద్ద పాట్స్‌ బౌలింగ్‌లో అదే బంతికి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఎదుర్కొన్న 26 బంతుల్లో 19 బంతుల్ని షార్ట్‌పిచ్‌గానే సంధించడం గమనార్హం. దీంతో ఇంగ్లాండ్‌ టీమ్‌ శ్రేయస్‌ను ఔట్‌ చేసేందుకు కచ్చితమైన ప్రణాళికతోనే బరిలోకి దిగిందని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఈ టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఎలా ఔట్‌ చేసిందనే వీడియోని తమ ట్విటర్‌లో పోస్టు చేసింది. మీరూ ఆ వీడియో చూసేయండి.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని