Updated : 24 Mar 2022 13:37 IST

Cricket News: సచిన్‌ బ్యాటింగ్‌ను గుర్తు చేసిన పాక్‌ క్రికెటర్‌.. వైరల్‌ వీడియో

                                                                                                      (Photo: ICC Instagram video screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మహిళల టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ సిద్రా అమిన్‌.. టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ బ్యాటింగ్‌ శైలిని గుర్తు చేసింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సిద్రా (32; 77 బంతుల్లో 4x4) పాక్‌ తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా నాట్‌ సీవర్‌ వేసిన 15వ ఓవర్‌ రెండో బంతికి ఆమె.. సచిన్‌లా స్ట్రైట్‌ డ్రైవ్‌ ఆడి బంతిని బౌండరీకి తరలించింది. ఆ షాట్‌ విశేషంగా ఆకట్టుకోవడంతో ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది.

ఈ షాట్‌ సచిన్‌ను గుర్తుచేస్తుందా? అని పేర్కొంటూ ఆ పోస్టుకు వ్యాఖ్యానం జతచేసింది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 105 పరుగులకే కుప్పకూలగా.. ఇంగ్లాండ్‌ ఒక్క వికెట్‌ కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ టామీ బ్యూమాంట్‌ (2) విఫలమైనా డానియెల్లీ వ్యాట్‌ (76; 68 బంతుల్లో 11x4), హేదర్‌నైట్‌ (24; 36 బంతుల్లో) ధాటిగా ఆడి మిగతా పని పూర్తి చేశారు. అయితే, పాక్‌ బ్యాటర్‌ సచిన్‌లా షాట్‌ ఆడటం ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. మీరూ ఆ వీడియో చూసి ఆస్వాదించండి.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని