IND vs SA: రాహుల్‌ విన్నింగ్‌ షాట్‌.. సూర్య క్లాసీ సిక్స్‌ చూశారా..!

ప్రపంచకప్‌ ముందు తన చివరి టీ0 సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. అద్భుతమైన స్వింగ్‌ బౌలింగ్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ దనాధన్‌

Published : 29 Sep 2022 11:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచకప్‌ ముందు తన చివరి టీ20 సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. పేస్‌ దళం అద్భుతమైన స్వింగ్‌ బౌలింగ్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ దనాధన్‌ బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాపై అదిరిపోయే విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. కఠినమైన పిచ్‌లోనూ సూర్య(50*) తనదైన దూకుడుతో ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్స్‌లు బాదుతూ కేఎల్‌ రాహుల్‌(51*)తో కలిసి స్కోరు బోర్డు మెల్లగా పరుగులు పెట్టించాడు.

లక్ష్య ఛేదనలో 7వ ఓవర్లో సూర్య కళ్లుచెదిరే సిక్సులతో అభిమానులను అలరించాడు. ఆ ఓవర్లో నోకియా వేసిన మూడో బంతి వికెట్లకు దూరంగా వెళుతున్నప్పటికీ సూర్య దాన్ని థర్డ్‌ మ్యాన్‌ మీదుగా భారీ సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత నాలుగో బంతిని అందంగా ఫ్లిక్‌ చేసి స్కేర్‌లెగ్‌ మీదుగా స్టాండ్స్‌కు పంపించాడు. ఇక 16వ ఓవర్లో షంసి వేసిన నాలుగో బంతిని వైస్‌ కెప్టెన్‌ రాహుల్‌ సిక్స్‌ కొట్టి అర్ధశతకంతో పాటు మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. ఈ సిక్సర్ల వీడియోలను వీడియోను బీసీసీఐ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని