Virat Kohli: విరాట్ కోహ్లీ ఇల్లు అదిరిపోయింది.. వీడియో చూశారా!

టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అలీబాగ్‌లోని తన విలాసవంతమైన ఇల్లుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Published : 09 Jul 2024 17:23 IST

ఇంటర్నెట్ డెస్క్: 2024 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ విజేతగా నిలిచింది. స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రస్తుతం తమ కుటుంబాలతో గడుపుతున్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కొన్ని రోజులపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లో సేద తీరుతున్నాడు. ఇదిలా ఉండగా.. కోహ్లీ తాజాగా అలీబాగ్‌లోని తన విలాసవంతమైన ఇల్లుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన సంబంధించిన దృశ్యాలను ఆ వీడియోలో పొందుపర్చారు. ఇందులో కోహ్లీ నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియోని పోస్టు చేస్తూ ‘‘మా కలల ఇంటిని సాకారం చేసినందుకు నిర్మాణ సంస్థలోని (అవాస్ టీమ్‌) అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.’’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌తో పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ మరికొన్ని వారాలపాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. త్వరలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో కూడా విరాట్ ఆడడు. ఈ సిరీస్ ముగిశాక భారత్.. బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కోహ్లీ  అందుబాటులోకి వస్తాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని