Super Over: విండీస్‌ మహిళల వీర బాదుడు.. సూపర్‌ ఓవర్‌లో 25 పరుగులు

మహిళల క్రికెట్‌లో వెస్టిండీస్‌ బ్యాటర్లు రెచ్చిపోయారు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే టైగా మారడంతో ఆట సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది...

Updated : 01 Feb 2022 16:47 IST

(Photo: ICC Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: మహిళల క్రికెట్‌లో వెస్టిండీస్‌ బ్యాటర్లు రెచ్చిపోయారు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే టైగా మారడంతో ఆట సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. అక్కడే విండీస్‌ క్రికెటర్లు దియాంద్ర డాటిన్ (19; 5 బంతుల్లో 2x4, 1x6)‌, హేలీ మాథ్యూస్‌ (6; 1 బంతి 1x6) దంచికొట్టారు. వీరిద్దరూ ఆరు బంతుల్లో 25 పరుగులు సాధించి దక్షిణాఫ్రికా బౌలర్‌ షబ్నిమ్‌ ఇస్మేయిల్‌కు చుక్కలు చూపించారు. తొలి బంతికి డాటిన్‌ రెండు పరుగులు తీయగా తర్వాత వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌, మూడు పరుగులు సాధించింది. ఇక చివరి బంతికి హేలీ మరో సిక్సర్‌ సంధించింది.

కాగా, ఈ సూపర్‌ ఓవర్‌కు ముందు దక్షిణాఫ్రికా పేసర్‌ షబ్నిమ్‌ మ్యాచ్‌లో చాలా పొదుపుగా బౌలింగ్‌ చేయడం గమనార్హం. కేవలం 3.65 ఎకానమీతో ఆకట్టుకోవడంతో కెప్టెన్‌ సున్‌ లూస్‌ సూపర్‌ ఓవర్‌లో అవకాశమిచ్చింది. కానీ, విండీస్‌ బ్యాటర్లు సూపర్‌ ఓవర్‌లో దంచికొట్టడంతో ఆమె చేతులెత్తేసింది. అనంతరం దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్లో ట్రియాన్‌ (7), తజ్మిన్‌ బ్రిట్స్‌(10) ధాటిగా ఆడినా చివరికి 17 పరుగులు సాధించి మ్యాచ్‌ను కోల్పోయారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా టీమ్‌ 40.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో విండీస్‌ సైతం 37.4 ఓవర్లకు 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో మ్యాచ్‌ టైగా మారి సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. కాగా, ఈ సూపర్‌ ఓవర్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మీరూ ఆ బ్యాటింగ్‌ విన్యాసాలు చూసి ఆస్వాదించండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని