యూనివర్సల్‌ బాస్‌ సిక్స్‌ కొడితే.. కిటికీ బద్దలైంది.! 

వెస్టిండీస్‌ విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌ బ్యాటింగ్‌ గురించి మనందరికీ తెలిసిందే. ఎంతటి బౌలరైనా లెక్క చేయకుండా ఎదురుదాడి చేస్తూ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.

Published : 27 Aug 2021 23:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెస్టిండీస్‌ విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌ బ్యాటింగ్‌ గురించి మనందరికీ తెలిసిందే. ఎంతటి బౌలర్‌నైనా లెక్క చేయకుండా ఎదురుదాడి చేస్తూ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. తాజాగా వెస్టిండీస్‌లో జరుగుతున్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)-2021లో జేసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో క్రిస్‌ గేల్‌ బాదిన సిక్స్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియట్స్‌ తరఫున బరిలోకి దిగిన క్రిస్‌ గేల్‌.. ఎక్కువ సేపు క్రీజులో నిలవకున్నా ప్రేక్షకులను అలరించాడు. జేసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో గేల్‌ బాదిన సిక్స్‌ నేరుగా వెళ్లి మైదానంలోని ఓ కిటికీని తాకడంతో అద్దం బద్దలైంది. ఆ వీడియోను సీపీఎల్‌ 2021 అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. యూనివర్సల్ బాస్‌ విధ్వంసాన్ని మీరూ చూసేయండి. ఈ మ్యాచ్‌లో గేల్‌ 9 బంతుల్లో ఓ ఫోరు, ఓ సిక్సర్‌ సహా మొత్తం 12 పరుగులు చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని