Cricket news: అంపైర్‌ నిర్ణయంపై పొలార్డ్‌ వినూత్న నిరసన

ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో విచిత్రం చోటు చేసుకుంది. మంగళవారం సెయింట్‌ లూసియా కింగ్స్‌(ఎస్‌ఎల్‌కే), ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌(టీకేఆర్‌) జట్ల మధ్య జరిగిన మ్యాచులో.. ఎస్‌ఎల్‌కే తరఫు బౌలర్‌ వహబ్‌ రియాజ్‌ భారీ వైడ్‌ వేశాడు. 

Published : 02 Sep 2021 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్కు: ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో విచిత్రం చోటు చేసుకుంది. మంగళవారం సెయింట్‌ లూసియా కింగ్స్‌(ఎస్‌ఎల్‌కే), ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌(టీకేఆర్‌) జట్ల మధ్య జరిగిన మ్యాచులో.. ఎస్‌ఎల్‌కే తరఫు బౌలర్‌ వహబ్‌ రియాజ్‌ భారీ వైడ్‌ వేశాడు. క్రీజులో ఉన్న టీకేఆర్‌ బ్యాట్స్‌మెన్‌ టిమ్‌ సీఫర్ట్‌ ఆ బంతిని ఆడేందుకు ప్రయత్నించినా అందలేదు. అయినా, ఫీల్డ్‌ అంపైర్ దాన్ని వైడ్‌గా పరిగణించలేదు. దీంతో నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న మరో బ్యాట్స్‌మెన్‌ కీరన్‌ పొలార్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ.. అంపైర్ నుంచి దూరంగా వెళ్లి నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 

ఈ మ్యాచులో పొలార్డ్ (26 బంతుల్లో 41)‌, మరో బ్యాట్స్ మెన్‌ సీఫర్ట్‌ (25 బంతుల్లో 37) కలిసి ఐదో వికెట్‌కు 78 పరుగులు జోడించి ఎస్‌ఎల్‌కే ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. అనంతరం ఛేదనకు దిగిన ఎస్‌ఎల్‌కే.. నిర్ణీత 20 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీకేఆర్‌ జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని