Dhoni - Pant : కెప్టెన్సీ పరంగా ధోనీ - పంత్ ఒకేలా ఉంటారు: షేన్ వాట్సన్

చిన్న వయస్సులోనే క్రికెట్ కెరీర్‌లో పంత్‌ సాధించినది చూస్తుంటే...

Updated : 26 Mar 2022 16:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కెప్టెన్సీపరంగా టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ, యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మధ్య ఒక పోలికను గుర్తించానని దిల్లీ అసిస్టెంట్ కోచ్‌, ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ తెలిపాడు. టీ20 లీగ్‌లో ధోనీ నాయకత్వంలో వాట్సన్‌ ఆడిన విషయం తెలిసిందే. ‘‘సాధారణంగా ప్రజలు యాపిల్‌ను యాపిల్‌తో పోల్చమని కోరుతుంటారు. క్రికెట్‌లో ఎవరికి వారు వ్యక్తిగత నైపుణ్యం కలిగి ఉంటారు. ఎంఎస్ ధోనీ, రిషభ్‌ పంత్‌ను ఒకరితో ఒకరిని ఇలానే పోల్చుకుంటారు. అయితే, వీరిద్దరూ వేర్వేరు శైలిలో ఆడే క్రికెటర్లు. ఇద్దరిలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉంది. కెప్టెన్‌గా రిషభ్‌ పంత్ చాలా కూల్‌గా.. నిశ్శబ్దంగా ఉంటాడు. ఇదే ఎంఎస్‌ ధోనీ కూడా ఇలానే ఉండేవాడు. వీరిద్దరి మధ్య కామన్‌గా ఉన్న లక్షణం ఇదే’’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు.

చిన్న వయస్సులోనే క్రికెట్ కెరీర్‌లో పంత్‌ సాధించినది చూస్తుంటే నమ్మశక్యంగా లేదని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. తన అనుభవాల నుంచి ఎప్పటికప్పుడు నేర్చుకునే గుణం పంత్‌ సొంతమని చెప్పాడు. ‘‘నేను ఆడిన అత్యుత్తమ సారథుల్లో రికీ పాంటింగ్ ఒకడు. ఉత్తమ ఆటగాళ్లను ఎలా తయారు చేయాలో పాంటింగ్‌కు బాగా తెలుసు. పంత్ ప్రతి రోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. అదే అతడిని ఈ స్థాయికి చేర్చింది’’ అని వివరించాడు. మరో మూడు రోజుల్లో (మార్చి 26) లీగ్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మార్చి 27న తొలి మ్యాచ్‌లో ముంబయితో దిల్లీ తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని