
Virat Kohli: దుబాయ్‌లో కోహ్లీ మైనపు విగ్రహం
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్ సంస్థ.. దుబాయ్‌లోని మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. టీమిండియా జెర్సీలో కోహ్లీ విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీ యూఏఈలోనే జరగనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం ఇది రెండోసారి. 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా కూడా కోహ్లీ మైనపు విగ్రహాన్ని లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఉన్న మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో సందర్శనకు ఉంచారు.
మరోవైపు పొట్టి ప్రపంచకప్ సన్నాహకాలను టీమ్‌ఇండియా అదరగొట్టింది. సోమవారం ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అక్టోబరు 20న టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. అక్టోబరు 24న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.