ఆటగాళ్లకు వ్యాక్సిన్‌.. భారత్‌లోనే ఐపీఎల్‌!

‘ఐపీఎల్‌ సీజన్‌-2021’ కచ్చితంగా భారత్‌ వేదికగానే జరుగుతుందని, ఇతర దేశాల్లో నిర్వహించాలనే ఆలోచనే లేదని బీసీసీఐ కోశాధాకారి అరుణ్‌ ధుమాల్‌.........

Published : 30 Jan 2021 22:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఐపీఎల్‌ సీజన్‌-2021’ కచ్చితంగా భారత్‌ వేదికగానే జరుగుతుందని, ఇతర దేశాల్లో నిర్వహించాలనే ఆలోచనే లేదని బీసీసీఐ కోశాధాకారి అరుణ్‌ ధుమాల్‌ పేర్కొన్నాడు. కరోనా కారణంగా 2020 సీజన్‌ యూఏఈ వేదికగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం యూఏఈ కంటే భారత్‌లోనే మెరుగైన పరిస్థితి ఉందని ధుమాల్ తెలిపాడు.

‘‘భారత్‌లోనే ఐపీఎల్ నిర్వహించేలా పనిచేస్తున్నాం. వేదిక ప్రత్యామ్నాయం గురించి కూడా ఆలోచించట్లేదు. అంతేగాక యూఏఈ కంటే భారత్‌లోనే మెరుగైన పరిస్థితి ఉంది. దేశంలో పరిస్థితులన్ని చక్కబడుతున్నాయి. స్టేడియంలో అభిమానులు మ్యాచ్‌ను వీక్షించేలా ప్లాన్ చేస్తున్నాం. అయితే పూర్తి సామర్థ్యంతో కాకుండా 25-50 శాతం సామర్థ్యంతో ప్రేక్షకులు వచ్చేలా ప్రయత్నిస్తున్నాం’’ అని ధుమాల్ వెల్లడించాడు.

కరోనా కారణంగా 2020-21 రంజీ టోర్నీని నిర్వహించలేకపోతున్నామని ధుమాల్‌ తెలిపాడు. అయితే వైట్ బాల్‌ క్రికెట్‌తో పాటు ఉమెన్స్‌, అండర్‌-19 క్రికెట్‌ జరుగుతాయని చెప్పాడు. వచ్చే ఏడాది మహిళల ప్రపంచకప్‌తో పాటు అండర్‌-19 ప్రపంచకప్‌ ఉండటంతో వాటి సాధనపై దృష్టిసారిస్తున్నామన్నాడు. అయితే, బయోబబుల్‌లో ఆడటం ఆటగాళ్లకు ఎంతో కష్టతరంగా ఉందన్నాడు.

‘‘బయోబబుల్‌లో ఆడటం ఎంతో కష్టం. అయితే మా ఆటగాళ్లకు వ్యాక్సిన్‌ వేయించేలా ప్రయత్నిస్తున్నాం. దీని కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. తొలుత ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, వృద్ధులకు టీకా అందించాలనేది మన ప్రభుత్వ నిర్ణయం. కానీ మా ఆటగాళ్లకు కూడా టీకా అందేలా ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని ధుమాల్ తెలిపాడు. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ విజయం సాధించిన టీమిండియాను ఆయన అభినందించాడు.

ఇవీ చదవండి..

ఆమెతో పరిచయం అలా.. : రహానె

వార్నర్‌ కుమార్తెకు కోహ్లీ స్పెషల్‌ గిఫ్ట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని