మేం ఛేదించగలం: లంబూ

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో గెలుపు అవకాశాలు ఉన్నాయని టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ అన్నాడు. 420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమని సానుకూల దృక్పథంతో ఉన్నామని పేర్కొన్నాడు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని వివరించాడు....

Published : 09 Feb 2021 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో గెలుపు అవకాశాలు ఉన్నాయని టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ అన్నాడు. 420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమని పేర్కొన్నాడు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని వివరించాడు. ఈ మ్యాచులో లంబూ 300 వికెట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. కపిల్‌, జహీర్‌ తర్వాత టీమ్‌ఇండియా తరఫున ఈ ఘనత సాధించిన మూడో పేసర్‌గా అతడు అవతరించాడు.

‘కెరీర్లో ఎత్తుపల్లాలు ఎన్నో చూశా. ఎంతో అనుభవం గడించా. ఉపఖండం, విదేశాల్లో ఎలా బౌలింగ్‌ చేయాలో ఎంతో మంది మార్గనిర్దేశకులు నేర్పించారు. గాయం తర్వాత దేశవాళీ క్రికెట్లో 4 ఓవర్లు విసిరిన తర్వాత కాస్త అలసిపోయినట్టు అనిపించింది. 3-4 రోజుల వ్యవధిలోనే 35 ఓవర్లు విసిరాను. ఆఖరి రోజు మాకు శుభారంభం లభిస్తే ఈ లక్ష్యాన్ని మేం ఛేదించగలం. ఎందుకంటే మాకు నిర్భయంగా ఆడగలిగే బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. ఇక్కడ చూడాల్సింది 381 పరుగుల్ని 9 వికెట్లను కాదు’ అని ఇషాంత్‌ అన్నాడు.

‘తొలి రెండు రోజులు పేసర్లు, స్పిన్నర్లకు పిచ్‌ అనుకూలించలేదు. రహదారిపై ఆడినట్టు అనిపించింది. నాలుగో రోజు ఆఖర్లో మాత్రం బంతి టర్న్‌ అవ్వడం మొదలైంది. ఇప్పుడు మరింత స్పందిస్తోంది’ అని లంబూ వెల్లడించాడు.

ఇవీ చదవండి
పంత్‌కే ఐసీసీ తొలి పురస్కారం
లోకల్‌ బాయ్స్‌ ఆల్‌రౌండ్‌ షో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని