Ashes : అక్కడ ఆసీస్‌ను ఓడించొచ్చని టీమ్‌ఇండియా నిరూపించింది: బట్లర్

భారత్‌ x పాకిస్థాన్ క్రికెట్‌ మ్యాచ్‌లకు ఎంత ఉత్కంఠభరితంగా ఉంటాయో... ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే..

Published : 08 Dec 2021 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ x పాకిస్థాన్ క్రికెట్‌ మ్యాచ్‌లు ఎంత ఉత్కంఠభరితంగా ఉంటాయో... ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్‌ సిరీసూ అంతే స్థాయిలో ఉంటుంది. నువ్వా నేనా అన్నట్లు కొదమసింహాలు మాదిరిగా పోరాడతాయి ఇరు జట్లూ. బుధవారం (డిసెంబర్ 8) నుంచే యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు ప్రారంభం కానుంది. అసలే బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా జరగనుంది. గబ్బా పిచ్‌ ఆసీస్‌కు కలిసొచ్చే మైదానాల్లో ఒకటి. అయితే 1988 నుంచి గబ్బాలో ఆసీస్‌ను ఓడించలేదనే అపవాదును చెరిపేస్తూ టీమ్‌ఇండియా గతేడాది 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మరీ ఘన విజయం అందుకొంది. దీంతో తాము కూడా భారత్‌ బాటలోనే ఆస్ట్రేలియాపై గెలిచి చూపిస్తామని ఇంగ్లాండ్ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ వెల్లడించాడు. 

అయితే, గబ్బా మైదానం ఇంగ్లాండ్‌కు అచ్చిరాలేదనే చెప్పాలి. 1986లో చివరిసారిగా ఇక్కడ ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. మొత్తం 21 టెస్టుల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. అయితే ఈసారి తమ A గేమ్‌ ప్లాన్‌తో ఆసీస్‌ ఆట కట్టిస్తామని బట్లర్‌ చెబుతున్నాడు. ‘‘యాషెస్‌ మాత్రమే కాదు ఎప్పుడైనా సరే ఆసీస్‌లో ఆడటం సవాలే. చరిత్ర కూడా అదే చెబుతుంది. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలనే ఉత్సుకతతో ఉన్నాం. ఆసీస్‌ తమ స్వదేశంలో చాలా భయకరంగా ఆడుతుంది. అయితే గతేడాది టీమ్‌ఇండియా ఇక్కడ సిరీస్‌ను గెలవడం చూశాం. కాబట్టే ఆసీస్‌ను ఓడించడమేమీ మాకు అసాధ్యం కాదు’’ అని వివరించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని