IND vs AUS: ఆస్ట్రేలియా సరైన నిర్ణయమే తీసుకుంది: స్టీవ్ స్మిత్

ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు ముందు ఆసీస్ ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్‌ను కూడా ఆడటం లేదు.

Published : 31 Jan 2023 18:45 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా జట్టు త్వరలో భారత్ పర్యటించనుంది. టీమ్‌ఇండియాతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. అయితే, టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆసీస్‌ ఒక్క ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా ఆడట్లేదు. నేరుగా సిరీస్‌లో భారత్‌ని ఢీకొననుంది. పిచ్‌లలో వ్యత్యాసం ఉంటుందని భావించి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడకూడదని ఆస్ట్రేలియా నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి ఆసీస్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్ మద్దతు పలికాడు.  వార్మప్‌ మ్యాచ్‌లు ఆడకపోవడం గురించి స్మిత్‌ వివరణ ఇచ్చాడు.

‘ఇంతకుముందు ఇక్కడ మేము ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాం. ఆ మ్యాచ్‌ల్లో ఆడాల్సిన అవసరం లేదు. మేము మా నెట్‌ ప్రాక్టీస్‌లో వీలైనంత ఎక్కువగా  స్పిన్నర్లను ఎదుర్కోవాలి.  ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా సరైన నిర్ణయం తీసుకున్నామని నేను భావిస్తున్నాను’ అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. స్మిత్‌ కంటే ముందు ఆసీస్ మరో బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా కూడా ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో స్పిన్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు