
Tokyo Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో 20కి పైగా పతకాలు సాధించడమే మా లక్ష్యం..!
దిల్లీ: 2024లో నిర్వహించబోయే పారిస్ ఒలింపిక్స్‌లో 20-25 పతకాలు సాధించేందుకు ప్రయత్నిస్తామంటూ భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా ధీమా వ్యక్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాలు సాధించి భారతీయ క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఓ స్వర్ణం సహా రెండు రజతం, మూడు కాంస్య పతకాలు సాధించి దేశ ప్రతిష్ఠను పెంచారు. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అయితే ప్రస్తుతం చాలా మంది క్రీడాకారులు తొలిసారిగా ఒలింపిక్స్ బరిలో దిగినట్టు భజరంగ్ పునియా తెలిపారు. ముందుగా ఆశించిన స్థాయిలో పతకాలు సాధించకున్నా.. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేశామన్నారు. రానున్న పారిస్ ఒలింపిక్స్‌లో మరింత మెరుగైన ప్రదర్శనతో భారత్‌కు పతకాల పంట పండిస్తామని పేర్కొన్నారు. మోకాలి గాయం కారణంగా అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయినట్టు తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం జరిగిన పురుషుల 65 కిలోల కుస్తీ పోటీల్లో భారతీయ స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా కాంస్య పతకం సాధించాడు. ప్లేఆఫ్ పోటీల్లో కజక్‌స్థాన్‌కు చెందిన దౌలత్ నియజ్‌బెకోవ్‌ను 8-0తో చిత్తు చేసి రెజ్లింగ్‌లో ఒలింపిక్స్ పతకం సాధించిన ఆరో భారతీయ క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.