IND vs ENG : మూడో రోజూ వర్షం అడ్డంకిగా మారే అవకాశం.. అయినా ఇంగ్లాండ్‌కే నష్టం!
బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు సాధించే దిశగా దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో...
ఇంటర్నెట్ డెస్క్: బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు సాధించే దిశగా దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 416 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. 84 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆటను ముగించింది. తొలి రోజు ఆటలో 17 ఓవర్లు (జరిగినవి 73 ఓవర్లు) వర్షార్పణం కాగా.. రెండో రోజు ఏకంగా 51 ఓవర్లపాటు ఆట రద్దైంది.
టీమ్ఇండియా బౌలర్లు విజృంభించి వికెట్లు తీస్తున్న వేళ ఇంగ్లాండ్ పాలిట ఆపద్బాంధవుడిగా వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ క్రమంలో మిగిలిన మూడు రోజుల్లోనూ వర్షం పడే సూచనలు ఉండటంతో మ్యాచ్ ఫలితంపై అనుమానాలు రేగుతున్నాయి. అయితే ఈ టెస్టు డ్రాగా ముగిసినా భారత్‌కు వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు ఇప్పుడు జరుగుతోంది. ఇవాళ మూడో రోజు ఆటకు కూడా వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. వర్షం వచ్చేందుకు దాదాపు 65 శాతం ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రోజంతా ఉష్ణోగ్రత 20 డిగ్రీల్లోపే ఉండనుంది. ఆట ప్రారంభంలోనే దాదాపు గంటన్నరపాటు వర్షం పడుతుందని, మధ్యాహ్నం సమయానికి కాస్త తెరిపినిచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. అయితే దాదాపు రోజంతా మేఘావృతంగా ఉంటుందని పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్