Rakheem Cornwall: టీ20ల్లో తొలి 200 కొట్టిన విండీస్ బాహుబలి
టీ20ల్లో శతకం చేయడమే అద్భుతమనుకుంటే.. విండీస్ బ్యాటర్ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. అయితే ఇది టీ20 లీగ్‌లో కావడం గమనార్హం. ఇంతకీ అతడు విండీస్ బాహుబలిగా పేరొందిన రకీం కార్నెల్ కేవలం 77 బంతుల్లోనే 200+ బాదేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20ల్లో అర్ధశతకం చేస్తే గొప్ప.. ఇక సెంచరీ మార్క్‌ను తాకితే అద్భుతం.. ఇలాంటి పొట్టి ఫార్మాట్లో ఏకంగా ఓ బ్యాటర్ డబుల్ సెంచరీ బాదేశాడు. మొత్తం 120 బంతులు ఉండే మ్యాచ్‌లో అతడే 77 బంతులను ఆడి 205 పరుగులు సాధించడం గమనార్హం. ఇంతకీ ఆ వీరభయంకర ప్లేయర్ ఎవరంటారా...? వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రకీం కార్నెల్.. ఇలా పేరు చెబితే పెద్దగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే అతడు తన జాతీయ జట్టు తరఫున ఆడిందే కేవలం తొమ్మిది టెస్టులు మాత్రమే. కానీ ‘విండీస్ బాహుబలి’ అనగానే.. భారీ కాయంతో ఉండే రకీం కార్నెల్ తప్పకుండా గుర్తుకొస్తాడు.
అయితే విండీస్ తరఫున ఆడుతూ రకీం కార్నెల్ ఇలా వీరవిహారం చేయలేదు. అమెరికా వేదికగా టీ20 టోర్నమెంట్ అట్లాంటా ఓపెన్‌లో అట్లాంటా ఫైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ చెలరేగాడు. కేవలం 77 బంతుల్లో 266.23 స్ట్రైక్‌రేట్‌తో 205 పరుగులను బాదేశాడు. అందులో 22 సిక్స్‌లు, 17 ఫోర్లు ఉండటం గమనార్హం. దీంతో స్క్వేర్ డ్రైవ్ జట్టుపై అట్లాంటా ఫైర్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది. ప్రముఖ గణాంక నిపుణుడు మోహన్‌దాస్ మేనన్ తన ట్విటర్లో పోస్టు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్‌రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్‌కు మారు పేరు! సన్‌రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్‌రేట్‌లో ఎప్పుడూ వెనుకంజే! సన్‌రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్‌కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్‌కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్‌తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్‌తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్‌కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్‌కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్‌ను తప్పించాల్సిందే
ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్‌ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300