Published : 02/07/2021 17:27 IST

T20 world cup: విండీస్‌,  కోహ్లీసేన ఫేవరెట్‌!

ఇంగ్లాండ్‌ గట్టి పోటీదారు: సాబా కరీమ్‌

ముంబయి: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌, టీమ్‌ఇండియా తన ఫేవరెట్‌ జట్లని మాజీ క్రికెటర్‌ సాబా కరీమ్‌ అన్నారు. కరీబియన్‌ జట్టు నిండా స్టార్లే  ఉన్నారని పేర్కొన్నారు. కోహ్లీసేన యువకులు, సీనియర్లతో సమతూకంగా ఉందన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిద్ధాంతాలను మార్చేసిన ఇంగ్లాండ్‌ సైతం గట్టి పోటీదారని వెల్లడించారు.

‘ప్రస్తుతానికి నా నంబర్‌ వన్‌ జట్టు వెస్టిండీస్‌. రెండోది టీమ్‌ఇండియా. కరీబియన్‌ జట్టు నిండా మ్యాచ్‌ విజేతలే ఉన్నారు. వారంతా భారీ సిక్సర్లు దంచగల పవర్‌ హిట్టర్లు. ఇక కోహ్లీసేన అటు యువత, ఇటు అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది. అయితే ఒక జట్టు గురించి మాత్రం మనం తప్పక మాట్లాడుకోవాలి. వారే ఇంగ్లాండ్‌. తెలుపు బంతి క్రికెట్‌కు వారు సరికొత్త రూపు తీసుకొచ్చారు. పైగా ఆ జట్టు సమతూకంగానూ కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో వారు గట్టి పోటీదారు’ అని సాబా కరీమ్‌ అన్నారు.

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరే అవకాశం ఉందని మరో క్రికెటర్‌ రీతిందర్‌ సింగ్‌ అన్నారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ విజయం వారిలో అంతులేని ఆత్మవిశ్వాసం నింపుతుందన్నారు. పొట్టి క్రికెట్‌ టైటిల్‌నూ గెలుచుకోవాలని వారు పట్టుదల ప్రదర్శిస్తారని అంచనా వేశారు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లోనూ భారత్‌, న్యూజిలాండ్‌ తలపడితే ఆసక్తికరంగా ఉంటుందని వెల్లడించారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని