World Test Championship: ఇంగ్లాండ్‌పై పాక్ ఓటమి.. భారత్‌కు మేలే చేసింది..
తొలి టెస్టులో పాక్‌పై ఇంగ్లాండ్ గెలుపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(World Test Championship) పాయింట్ల పట్టికలో భారత్(Team India)కు మేలు చేసే విధంగా ఉంది.
ఇంటర్నెట్‌డెస్క్ : పరుగుల వరదలా సాగిన టెస్టులో పాకిస్థాన్(Pakistan)పై ఇంగ్లాండ్(England) చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 15 వందలకు పైగా పరుగులు నమోదైన ఈ టెస్టులో ఇంగ్లాండ్.. 74 పరుగుల తేడాతో పాక్‌పై గెలుపొందింది. అయితే.. ఈ విజయం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(World Test Championship)లో ఇంగ్లాండ్ జట్టుకు ప్రయోజనం కలిగించడమే కాకుండా.. పాయింట్ల పట్టికలో భారత్(Team India)కూ మేలే చేసింది.
ఈ టెస్టులో పాక్ అపజయంతో.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్ చేరే అవకాశాలు భారత్‌కు మరింత మెరుగయ్యాయి. ఎందుకంటే పాక్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోనే ఉంది. భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ భారత్, ఆసీస్ తమ తర్వాతి టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధిస్తే.. బాబర్ అజామ్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు చేరుకోవడం క్లిష్టంగా మారుతుంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-0తో గెల్చుకుని.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఓడిపోకపోతే.. భారత్ టాప్ 2 ప్లేస్‌లో నిలిచే అవకాశం ఉంది.
అయితే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఇంకో రెండు మ్యాచ్‌లు ఉండటంతో.. పాక్ పుంజుకునేందుకూ అవకాశాలు ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం
-
General News
ED: మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత పేర్లు
-
Crime News
కారు ప్రమాదం.. కళ్లముందే నిండు గర్భిణీ, భర్త సజీవదహనం
-
World News
Mossad: ఇరాన్ క్షిపణి స్థావరంపై మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్..!
-
Politics News
nara lokesh-yuvagalam: కొత్త కంపెనీ వచ్చిందా? ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా?: నారా లోకేశ్
-
Sports News
Hardik: ధోనీ పోషించిన బాధ్యత నాపై ఉంది.. ఒక్కోసారి కాస్త నిదానం తప్పదు: హార్దిక్