Virat Kohli: కోహ్లీకి ఏమైంది?

టీ20 ప్రపంచకప్‌కు తనను ఎంపిక చేయాలా వద్దా అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఐపీఎల్‌లో చెలరేగి ఆడి ఆ చర్చకు తెరదించాడు విరాట్‌ కోహ్లి.

Published : 13 Jun 2024 03:08 IST

టీ20 ప్రపంచకప్‌కు తనను ఎంపిక చేయాలా వద్దా అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఐపీఎల్‌లో చెలరేగి ఆడి ఆ చర్చకు తెరదించాడు విరాట్‌ కోహ్లి. సూపర్‌ ఫామ్‌తో పొట్టి కప్పులో అడుగు పెట్టిన అతడి నుంచి మెరుపులు ఆశిస్తే.. వరుస వైఫల్యాలతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు. 1, 4, 0.. ఇవీ టోర్నీలో కోహ్లి స్కోర్లు. ఐర్లాండ్‌పై విఫలమైతే.. కీలకమైన పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చెలరేగుతాడులే అనుకున్నారు అభిమానులు. కానీ ఆ మ్యాచ్‌లోనూ తేలిపోయాడు. అమెరికాపై అయినా ఫామ్‌ అందుకుంటాడనుకుంటే.. ఆఫ్‌ స్టంప్‌ ఆవల పడే బంతిని వెంటాడి ఔటయ్యే పాత బలహీనతను బయటపెట్టుకుంటూ ఇన్నింగ్స్‌ రెండో బంతికే వెనుదిరిగాడు. న్యూయార్క్‌ పిచ్‌ బ్యాటింగ్‌ చాలా కష్టంగా మారిన మాట నిజమే. కానీ కోహ్లి లాంటి మేటి బ్యాటర్లు ఇలాంటి పిచ్‌ల మీదే నిలబడి తమ సత్తా చూపిస్తారని అభిమానులు ఆశిస్తారు. కానీ వరుసగా మూడు వైఫల్యాలతో కోహ్లి ఆశ్చర్యపరిచాడు. తర్వాతి మ్యాచ్‌ (కెనడాతో)కు వేదిక మారబోతోంది. అక్కడైనా కోహ్లి మార్కు కనిపిస్తుందేమో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు