IPL Final: అహ్మదాబాద్‌లో వర్షం.. మ్యాచ్‌ నిర్వహణపై రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

ఐపీఎల్‌ ఫైనల్‌ (IPL Final) మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ప్రస్తుతం మైదానంలో చిన్నపాటి జల్లులు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహణలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి.

Updated : 28 May 2023 19:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఐపీఎల్‌(IPL) ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దిగ్గజ జట్లైన చెన్నై (Chennai Super Kings), గుజరాత్‌ (Gujarat Titans) ఫైనల్‌ (IPL Final) పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. విజేత ఎవరో తేల్చే ఉత్కంఠ పోరు మరికొద్దిసేపట్లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం మైదానంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహణ పరిస్థితి ఏంటి? విజేతను ఎలా నిర్ణయిస్తారు అనేది చూద్దాం. 

నిబంధనలు ఏం చెబుతున్నాయ్‌

  • ఒక్కో జట్టు కనీసం 5 ఓవర్ల ఆట సాధ్యంకాకపోతేనే మ్యాచ్‌ రిజర్వ్‌డేకు వెళ్తుంది.
  • ఒకవేళ కనీసం ఒక్క బంతి పడ్డా.. రిజర్వ్‌డే రోజున అక్కడి నుంచే మ్యాచ్‌ కొనసాగుతుంది.
  • ఒకవేళ టాస్‌ పడి.. ఒక్క బంతి పడకపోతే.. రిజర్వ్‌డే రోజు కొత్తగా మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.
  • రిజర్వ్‌డే రోజు టాస్‌ కూడా మళ్లీ వేస్తారు. కెప్టెన్లు కూడా తమ జట్లను మార్చుకునే అవకాశం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని