IND vs AUS: ఆసీస్‌ను కలవరపెడుతున్న వరుణుడు.. భారత్‌తో మ్యాచ్‌ రద్దైతే పరిస్థితేంటి?

భారత్‌ vs ఆస్ట్రేలియా సూపర్‌ 8 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయితే పరిస్థితేంటి..?

Updated : 24 Jun 2024 16:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సూపర్‌ 8 పోరులో (T20 World Cup Super-8) తమ చివరి మ్యాచ్‌లో తలపడేందుకు భారత్‌, ఆస్ట్రేలియా సిద్ధమవుతున్నాయి. ఆసీస్‌ను ఓడించి వన్డే ప్రపంచకప్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్‌ఇండియా చూస్తుండగా.. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ రేసులో నిలవాలని ఆసీస్‌ (Australia) పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు వరుణుడి గండం పొంచి ఉంది.

మ్యాచ్‌ జరిగే ప్రాంతంలో రోజంతా వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆక్యూ వెదర్‌ రిపోర్టు అంచనా వేసింది. పగటిపూట వర్షం పడే అవకాశాలు 70 శాతం వరకూ ఉన్నాయని.. పూర్తి మ్యాచ్‌ (IND vs AUS match) జరిగే అవకాశాలు లేవని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు వర్షం అలాగే కొనసాగితే మ్యాచ్‌ రద్దయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే..

  • టీమ్‌ఇండియా (Team India) ఇప్పటికే రెండు విజయాలతో దాదాపు సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది.
  • నేటి మ్యాచ్‌ రద్దు అయితే.. ఆస్ట్రేలియా, భారత్‌కు చెరో పాయింట్‌ లభిస్తుంది. 5 పాయింట్లతో రోహిత్‌ సేన (Rohit Sharma) సెమీస్‌కు చేరుతుంది.
  • ఆసీస్‌ మూడు పాయింట్లకు చేరుతుంది. ఆ జట్టు సెమీస్‌కు చేరే అవకాశాలు.. బంగ్లాదేశ్‌ vs అఫ్గానిస్థాన్‌ (AFG vs BAN) మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడి ఉంటాయి.
  • అఫ్గాన్‌ను బంగ్లా ఓడిస్తే.. ఆసీస్‌ నాకౌట్‌కు చేరుతుంది. ఒకవేళ అఫ్గాన్‌ విజయం సాధిస్తే.. కంగారూల జట్టు ఇంటి ముఖం పట్టక తప్పదు.
  • మ్యాచ్‌ జరిగి.. ఆసీస్‌ ఓడినా అవకాశం ఉంటుంది. అది సాధ్యం కావాలంటే.. అఫ్గాన్‌ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని