WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
WTC Finalకు రంగం సిద్ధమైంది. ఒకవేళ ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తే, మ్యాచ్ డ్రా అయితే.. విజేతను ఎలా నిర్ణయిస్తారు..?
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక మహా సమరానికి (WTC Final) వేళైంది. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న WTC Final కోసం దిగ్గజ జట్లు భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) సిద్ధమయ్యాయి. గత సీజన్‌లో ఫైనల్ వరకూ వెళ్లిన టీమ్‌ఇండియా.. ఈ సారి టైటిల్ గెలిచి.. భారత్‌కు ఐసీసీ ట్రోఫీల కరవును తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ పోరు కోసం ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఐదు రోజుల పాటు జరిగే ఈ టెస్టు మ్యాచ్‌లో ఫలితం తేలక మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. వర్షం వల్ల ఆట ఆగిపోతే.. పరిస్థితి ఏంటి? ఐసీసీ నిబంధనలు ఎలా ఉన్నాయి..?
- ఐదు రోజుల ఆటలో వర్షం వల్ల ఎక్కువ సమయం నష్టపోతే.. లేదా ఒక రోజు మొత్తం తుడిచిపెట్టుకుపోయినా ఆట ఆరో రోజైన రిజర్వ్‌డే (Reserve Day)కు వెళ్తుంది. ఈ ఫైనల్‌కు ఐసీసీ రిజర్వ్‌డేను కేటాయించిన విషయం తెలిసిందే.
- రిజర్వ్‌డే రోజూ ఆట సవ్యంగా సాగకపోయి.. మ్యాచ్ డ్రా అయితే.. ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.
- ఒకవేళ ఐదు రోజుల్లోనే మ్యాచ్ డ్రా (Draw)గా ముగిస్తే.. భారత్, ఆస్ట్రేలియాను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.
- మ్యాచ్ టైగా ముగిసినా.. ట్రోఫీని ఇరు జట్లు పంచుకుంటాయి.
ఇతర ఈవెంట్లలో అయితే.. ఇలాంటి సందర్భాల్లో బౌండరీ కౌంట్లు, సూపర్ ఓవర్లు, లీగ్ దశలో వారి ప్రదర్శన లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇలా ఉండదు.
వర్షం అంతరాయం కలిగిస్తేనే రిజర్వ్ డే (Reserve Day)..
మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినప్పుడు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ సమయాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే మ్యాచ్ రిజర్వ్‌డేకు వెళ్తుంది. కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి, మ్యాచ్ విజేతను తేల్చేందుకు రిజర్వ్‌డేను ఉపయోగిస్తారు. వర్షం పడకపోతే.. మ్యాచ్ ఐదు రోజుల్లోనే ముగుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!