
Virat Kohli: తొలిసారి కోహ్లీ గడుసరి ఆటగాడని అనుకున్నా: ఏబీ డివిలియర్స్
(Photo: Virat Kohli Instagram)
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకూ కప్పు సాధించకపోవచ్చు కానీ, ఆ జట్టుకు ఉన్న క్రేజే వేరు. అందుకు ప్రధాన కారణం మాజీ సారథి విరాట్ కోహ్లీ ఒకటైతే.. మరొకటి మిస్టర్ 360 బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్. ఆధునిక క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన వీరిద్దరు కొన్నేళ్ల పాటు ఆ జట్టు బ్యాటింగ్ లైనప్‌కు వెన్నెముకలా నిలిచారు. అయితే, తాజాగా డివిలియర్స్ కోహ్లీ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. మాజీ సారథిపై తన తొలి అభిప్రాయం ఏమిటో వివరించాడు. ఇటీవల ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఏబీడీ.. కోహ్లీని తొలిసారి ‘కాస్త గడుసరి’ ఆటగాడని పేర్కొన్నాడు.
‘మేం ఇద్దరం ప్రత్యేకంగా తొలిసారి కలవడానికి ముందే పలుమార్లు బయట పలకరించుకున్నాం. దాంతో మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పరిచయం ఉంది. మొదట్లో కోహ్లీని చూసి కాస్త గడుసరి ఆటగాడని అనుకున్నా. అదే అతడి గురించి నా తొలి అభిప్రాయం. అయితే, క్రికెట్ బాగా ఆడుతున్నా కోహ్లీకి కొంచెం గర్వం, అతివిశ్వాసం ఉన్నట్లు కనిపించాడు. తొలిసారి మా భేటి కాసేపే జరిగింది. అయినా అప్పుడు నేను ఎలాంటి కామెంట్ చేయలేదు. ఆ వయసులో క్రికెటర్లు అలాగే ఉండాలని నేను భావించాను. కానీ, ఆర్సీబీకి ఎంపికయ్యాక మేం ఇద్దరం మళ్లీ కలుసుకొని మాట్లాడుకున్నాం. దాంతో మేం బాగా కలిసిపోయాం. అప్పటి నుంచే మా మధ్య అనుబంధం పెరిగింది. స్నేహంగా మారింది. నేనైతే సహజంగా ఎవరితోనూ మాట్లాడను. ఎందుకో కోహ్లీతో బాగా కనెక్ట్ అయ్యా. మా అనుబంధం కొనసాగింది. దీంతో అతడితో ఎల్లప్పుడూ టచ్‌లోనే ఉంటున్నా. మా ఇద్దరి మధ్య చాలా విషయాలు ఒకేలా ఉంటాయి. మేం క్రికెట్ ఆడే విధానం కూడా ఒకలాగే ఉంటుంది’ అని డివిలియర్స్ వివరించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
-
World News
Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్ యార్డు’గా మారిన పాకిస్థాన్!
-
India News
Manish Sisodia: దిల్లీ ఉప ముఖ్యమంత్రిపై పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
EV charging station: హైదరాబాద్ చుట్టుపక్కల 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. ప్రయోగాత్మకంగా ఇక్కడే!
-
India News
Prisoners List: పాక్ చెరలో ఉన్న భారతీయ ఖైదీల సంఖ్య ఎంతో తెలుసా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..