IPL Playoffs: లఖ్‌నవూ గెలుపు.. ఇతర జట్లపై ప్రభావమెంతంటే..?
ఐపీఎల్(IPL 2023) ప్లేఆఫ్స్ రేసు(Playoffs Race) కొనసాగుతోంది. ప్రస్తుత తరుణంలో ఒక జట్టు ఓడినా.. గెలిచినా ఆ ప్రభావం ఇతర జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఇంటర్నెట్ డెస్క్ : ఐపీఎల్(IPL 2023)లో ప్లేఆఫ్స్ రేసు హోరాహోరీగా కొనసాగుతోంది. ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లోకి చేరిన తొలి జట్టుగా గుజరాత్(Gujarat Titans) నిలవగా.. మిగతా మూడు స్థానాల కోసం పోటీ నెలకొంది. ఇక మంగళవారం కీలక మ్యాచ్‌లో ముంబయి(Mumbai Indians)పై లఖ్‌నవూ(Lucknow Super Giants) అనూహ్య విజయాన్ని నమోదు చేయడంతో ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఈ ఫలితంతో లఖ్‌నవూ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. అదే సమయంలో ఇతర జట్లపై పడే ప్రభావాన్ని పరిశీలిస్తే..
చెన్నై(chennai super kings) : ప్రస్తుతం 15 పాయింట్లతో ఉన్న చెన్నై ఆఖరి మ్యాచ్‌లో దిల్లీపై గెలిస్తే.. టాప్ 2లోనే నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ చెన్నై ఓడి.. తమ చివరి మ్యాచుల్లో లఖ్‌నవూ, ముంబయి, బెంగళూరు గెలిస్తే.. అప్పుడు సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు ప్రమాదంలో పడతాయి.
ముంబయి(Mumbai Indians) : లఖ్‌నవూపై ఓటమితో ముంబయి ఇండియన్స్ తన చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. అప్పుడు ముంబయి 16 పాయింట్లకు చేరుకుంటుంది. అదే సమయంలో.. బెంగళూరు, పంజాబ్ కూడా తమ తదుపరి మ్యాచ్‌ల్లో గెలిస్తే 16 పాయింట్లకు చేరుకుంటాయి. ఈ జట్ల మధ్య పోటీ నెలకొననుంది. ఆఖరి గేమ్‌లో ఓడిపోతే మాత్రం ముంబయికి అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతాయి.
బెంగళూరు(Royal Challengers Bangalore) : ఈ జట్టుకు ఉన్న ఏకైక సానుకూలంశం పాజిటివ్ రన్ రేట్. రాజస్థాన్‌పై భారీ విజయమే ఇందుకు కారణం. అయితే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక నెగ్గడంతోపాటు ఇతర జట్ల ఫలితాలు తనకు సానుకూలంగా ఉండాలి. ప్రస్తుతం 12 పాయింట్లతో బెంగళూరు కొనసాగుతోంది.
పంజాబ్(Punjab Kings) : పంజాబ్ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో భారీ రన్‌రేట్‌తో గెలవాలి. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాలి. మైనస్ నెట్‌రన్‌రేట్ ఈ జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక నేడు దిల్లీతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోతే.. ప్లేఆఫ్స్ అవకాశాలు లేనట్లే.
ఇక ఒక మ్యాచ్ ఆడాల్సి ఉన్న రాజస్థాన్ ప్లేఆఫ్స్ చేరాలంటే తదుపరి పంజాబ్‌తో జరిగే మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. మరోవైపు ముంబయి, బెంగళూరు తర్వాతి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. కోల్‌కతా ప్లేఆఫ్స్ చేరాలంటే అద్భుతాలు జరగాల్సిందే. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ వరుస ఓటములతో ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు
-
Movies News
Vishwak Sen: అందుకే పేరు మార్చుకున్నా: విశ్వక్ సేన్
-
World News
Ukraine: జెలెన్స్కీ ఇంటి ఎదుట ‘నాటు-నాటు’ పాటకు దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
India News
Train Accident: ‘కోరమాండల్’ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు