Akash Chopra: ‘‘మీరు సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేయండి’’.. స్పందించిన ఆకాశ్ చోప్రా
ప్రముఖ క్రీడా వ్యాఖ్యాత, విశ్లేషకుడు, మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాకు సోషల్ మీడియాలో ఓ సలహా వచ్చింది. తాజాగా సెలెక్టర్ల పోస్టులను భర్తీ చేసేందుకు బీసీసీఐ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేయాలని ఓ నెటిజన్ కోరాడు. దీనికి ఆకాశ్ చోప్రా స్పందించాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ నియామకం కోసం బీసీసీఐ నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 28వ తేదీ వరకు గడువు ఉంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. క్రీడా విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా చోప్రా అందరికీ సుపరిచితమే. భారత్ తరఫున పది టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకొనేందుకు కనీసం ఏడు టెస్టులు ఆడిన అనుభవం ఉంటే సరిపోతుంది. ఆ లెక్కన ఆకాశ్ చోప్రాకు అవకాశం ఉంది.
దీంతో ఓ అభిమాని ‘‘సెలెక్టర్ పదవికి మీరు కూడా దరఖాస్తు చేసుకోండి. భారత క్రికెట్ వృద్ధి కోసం మీరు చాలా రకాలుగా సూచనలు, సలహాలు ఇస్తుంటారు. మంచి జట్టును తయారుచేసే కీలకమైన సెలెక్షన్ ప్రాసెస్‌లో భాగస్వామ్యం అయితే బాగుంటుంది’’ అని ట్వీట్ చేశాడు. దీనికి ఆకాశ్ చోప్రా ప్రతిస్పందించాడు. ‘‘ఈ బాధ్యతలను స్వీకరించడం ఎప్పుడూ గర్వకారణమే. కానీ ఇప్పుడు నాకు సరైన సమయం కాదు’’ అని బదులిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు