Published : 24 May 2022 01:18 IST

Cheteshwar Pujara: అక్కడ నా ప్రదర్శనను గుర్తించినందుకు సంతోషం: పుజారా

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేశాడు. గత కొంత కాలంగా ఫామ్‌లో లేని అతడిని సెలెక్షన్‌ కమిటీ ఈ ఏడాది మార్చిలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, తర్వాత భారత్‌లో టీ20 లీగ్‌ జరుగుతున్న సమయంలోనే పుజారా ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో పాల్గొన్నాడు. ససెక్స్‌ టీమ్‌ తరఫున అక్కడ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ద్వితశకాలు, రెండు శతకాలు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో తిరిగి లయ అందుకున్న అతడిని సెలెక్షన్‌ కమిటీ ఆదివారం ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ఎంపిక చేసింది.

ఈ నేపథ్యంలోనే ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన పుజారా.. ‘జులైలో ఇంగ్లాండ్‌తో జరిగే ఏకైక టెస్టుకు నన్ను ఎంపిక చేయడం బాగుంది. కౌంటీ క్రికెట్‌లో నా ప్రదర్శనను గుర్తించినందుకు సంతోషం. అక్కడ బరిలోకి దిగి మైదానంలో పరుగులు చేయడం ద్వారా.. అది ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ముందు నన్ను మంచి స్థితిలో ఉంచుతుందనే నమ్మకంతో ఉన్నా. ఎప్పటిలాగే ఈసారి కూడా మంచి ప్రాక్టీస్‌తో ముందుకు సాగి జట్టు విజయానికి కృష్టి చేయాలనుకుంటున్నా’ అని పుజారా పేర్కొన్నాడు. కాగా, గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా కరోనా కేసుల కారణంగా చివరి టెస్టు ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో నిలిచింది. అప్పుడు వాయిదా పడిన మ్యాచ్‌ను ఈ ఏడాది జులై 1 నుంచి 5 వరకు నిర్వహించేందుకు రెండు జట్ల బోర్డులు అంగీకరించాయి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts