WTC Final: అతడికి బౌలింగ్ చేసినా.. సచిన్‌కు చేసినా ఒకేలా భావిస్తా: వసీమ్ అక్రమ్
ఒకేసారి మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణించే బ్యాటర్లు తక్కువగా ఉంటారు. అయితే టీమ్‌ఇండియా యువ బ్యాటర్ మాత్రం అద్భుతమైన ఫామ్‌తో కొనసాగుతూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌పై (Shubman Gill) సర్వత్రా ప్రశంసలు జల్లు కురుస్తూనే ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా (890) రికార్డు సృష్టించి ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు టెస్టుల్లోనూ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ (WTC Final) గిల్ కీలకమవుతాడని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ యువ బ్యాటర్‌ను అభినందనలతో ముంచెత్తాడు. సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీలతో గిల్‌ను పోలుస్తూ ప్రశంసించాడు. ఇలాగే కొనసాగితే తప్పకుండా గిల్ క్రికెట్ ప్రపంచం భవిష్యత్తు సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడని అభివర్ణించాడు.
‘‘నేను శుభ్‌మన్ గిల్ వంటి బ్యాటర్‌కు బౌలింగ్ చేస్తే.. ఒకవేళ అది టీ20 ఫార్మాట్ అయినా సరే సచిన్ తెందూల్కర్‌కు బౌలింగ్ చేసినట్లు భావిస్తా. సచిన్‌కు వన్డేల్లోని తొలి పది ఓవర్లలో బౌలింగ్ చేసినప్పుడు కలిగిన అనుభవమే గిల్ విషయంలోనూ కలుగుతుంది. ఒకవేళ జయసూర్య, కలువితరణ వంటి బ్యాటర్లకు బౌలింగ్ చేసే అవకాశం మళ్లీ వస్తే తప్పకుండా ఔట్ చేయగలను. ఎందుకంటే వారిద్దరు బంతిని లేపడానికి ప్రయత్నిస్తారు. దొరికిపోతారు. కానీ సచిన్, గిల్‌వి మాత్రం అద్భుతమైన షాట్లు. నిలకడగా మూడు ఫార్మాట్లలోనూ మంచి స్కోర్లు సాధించగల బ్యాటర్లలో గిల్ ముందుంటాడు’’ అని వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు. శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు 15 టెస్టుల్లో 890 పరుగులు చేశాడు. మరో 110 పరుగులు చేస్తే వెయ్యి పరుగుల క్లబ్‌లోకి చేరతాడు. గిల్ ఫామ్‌ను చూస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనే ఆ మార్క్‌ను తాకే అవకాశం లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా