Pervez Musharraf - MS Dhoni: ‘నీ హెయిర్‌ స్టైల్‌ బాగుంది ధోనీ.. జుట్టు కత్తిరించుకోవద్దు’

అనారోగ్యంతో కన్నుమూసిన పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ ( Pervez Musharraf) క్రికెట్‌ ప్రేమికుడు. ఆయన ఓ సారి టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనీ (Dhoni) హెయిర్‌ స్టైల్‌కి ఫిదా అయ్యాడు. 

Updated : 05 Feb 2023 20:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌(Pakistan) మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ (79)(Pervez Musharraf) కన్నుమూశారు. గత కొంతకాలంగా అమైలాయిడోసిస్‌ అనే రుగ్మతతో బాధపడుతోన్న ఆయన.. దుబాయిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ముషారఫ్‌ మంచి క్రికెట్‌ ప్రేమికుడు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే క్రికెట్‌ పోటీలను ఆస్వాదించేవాడు. ఆయన ఓ సారి మన మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్. ధోనీ (MS Dhoni) హెయిర్‌ స్టైల్‌ని చూసి ఫిదా అయిపోయాడు. అంతేకాదు జుట్టు కత్తిరించుకోవద్దని ధోనీకి సూచించాడు. అప్పట్లో ధోనీ పొడుగు జట్టుతో ట్రెండ్‌ సెట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ద్వైపాక్షిక సిరీస్‌ కోసం భారత్‌ 2006లో చివరసారిగా పాకిస్థాన్‌లో పర్యటించింది. లాహోర్‌లో వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం నిర్వహించిన ప్రజెంటేషన్ వేడుకలో అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్ పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టును ముషారఫ్ అభినందించారు. టీమ్‌ఇండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ అనుహ్యంగా చెలరేగి 46 బంతుల్లోనే 72 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గానూ నిలిచాడు.

‘కీలక ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌కు విజయాన్ని అందించినందుకు అభినందనలు. నీకో విషయం చెప్పాలి. ధోనీ హెయిర్‌కట్ చేసుకోవాలని కోరుతూ ప్లకార్డ్‌ను చూశాను. కానీ, ఈ హెయిర్‌కట్‌లో మీరు బాగా కనిపిస్తున్నారు. జుట్టు కత్తిరించుకోవద్దు’ అని ముషారఫ్‌ ధోనీతో అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని