IND Vs AUS: రోహిత్‌ అద్భుతంగా ఆడాడు కానీ.. ఎక్కడ ఇబ్బంది పడ్డాడంటే.. : గావస్కర్‌

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఓటమితో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిన టీమ్‌ఇండియా.. రెండో

Published : 24 Sep 2022 12:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఓటమితో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిన టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లో విజయంతో పుంజుకుంది. 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసి రేసులో నిలిచింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (46 నాటౌట్‌; 20 బంతుల్లో 4×4, 4×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. రోహిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి.

హిట్‌మ్యాన్‌ ఇన్నింగ్స్‌ మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌నూ ఆకట్టుకుంది. అయితే.. ఈ సందర్భంగా రోహిత్‌కు గావస్కర్‌ పలు సూచనలు చేశాడు. ‘రోహిత్‌ చాలా జాగ్రత్తగా ఆడాడు. చాలా సెలెక్టివ్‌గా షాట్లు బాదాడు. ఫ్లిక్ షాట్లు లేదా పుల్‌ షాట్లు అతడు బాగా ఆడతాడు. అయితే.. ఆఫ్‌సైడ్‌లో ఆడాలని చూసినప్పుడే అతడు ఇబ్బంది పడుతున్నాడు. అక్కడే అతడు స్టాండ్స్‌లోకి కాకుండా గాల్లోకి బంతిని లేపుతున్నాడు. ఇదొక్క విషయంలోనే అతడు జాగ్రత్తగా ఉండాలి. ఈ మ్యాచ్‌లో అతడు చాలా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు’ అని గావస్కర్‌ కొనియాడాడు.

మైదానం తడిగా ఉండడంతో రెండున్నర గంటలు ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో మొదట ఆసీస్‌ 5 వికెట్లకు 90 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ (2/13) ఆ జట్టును దెబ్బ కొట్టగా.. అనంతరం రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఇక ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానంలో జరగబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని