IND vs PAK : విరాట్‌ని ఔట్ చేయడం ఎప్పటికీ మర్చిపోను : షహీన్ అఫ్రిదీ

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీని ఔట్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని పాకిస్థాన్ యువ పేసర్‌ షహీన్ అఫ్రిదీ అన్నాడు. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన...

Published : 30 Jan 2022 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీని ఔట్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని పాకిస్థాన్ యువ పేసర్‌ షహీన్ అఫ్రిదీ అన్నాడు. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన అతడికి ఇటీవల ‘ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌’ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ క్రీడా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

* హ్యాట్రిక్ వికెట్లు తీసే అవకాశం వస్తే ఎవరెవరిని పెవిలియన్‌కు పంపాలనుకుంటున్నారు?

భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.

* ఇప్పటి వరకు తీసిన వికెట్లలో ఎప్పటికీ మర్చిపోలేనిది?
 
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేయడం.

* కెరీర్‌ ముగిసే లోపు ఎలాంటి రికార్డులను సాధించాలనుకుంటున్నారు?

అన్ని ఫార్మాట్లలో నంబర్‌ వన్‌గా ఉండాలి.

* ఫాస్ట్ బౌలర్‌గా మారడానికి ఆదర్శం ఎవరు?

పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌

* మాజీ దిగ్గజ క్రికెటర్లకు బౌలింగ్ చేసే అవకాశం వస్తే.. మీ బౌలింగ్‌తో ఎవరిని పరీక్షించాలనుకుంటున్నారు?

వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా

* మీ జట్టులో సెల్ఫీలు బాగా తీసేదెవరు?

పొడుగ్గా ఉంటాను కాబట్టి నేనే ఎక్కువగా తీస్తుంటాను

* బాగా ఇష్టమైన స్టేడియం?

లార్డ్స్‌   

* క్రికెటర్ కాకపోయుంటే ఏం చేసేవారు?

వేరే ఏదైనా ఆటను కెరీర్‌గా మలుచుకునే వాడిని

* మీకున్న నిక్‌నేమ్స్‌ ఏంటి?

షీను, లాలా

* మీకు బాగా గుర్తు ఉన్న మ్యాచ్?

2014లో జరిగిన ఆసియా కప్‌ ( ఈ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కి చేరినా.. శ్రీలంక చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచింది) 

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు ఆరంభంలోనే షహీన్‌ అఫ్రిదీ వరుస షాకులిచ్చాడు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (0), కేఎల్‌ రాహుల్‌ (3) ఔట్‌ చేసి భారత్‌ని దెబ్బతీశాడు. తన చివరి ఓవర్లో విరాట్ కోహ్లీ (57)ని పెవిలియన్‌కి పంపాడు. ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టిన షహీన్‌ 31 పరుగులు ఇచ్చాడు. దీంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులకు పరిమితమైంది. ఛేదనలో పాక్‌ ఓపెనర్లు మహమ్మద్‌ రిజ్వాన్‌ (79), బాబర్‌ (68) అర్ధ శతకాలతో రాణించారు. దీంతో పాక్‌ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని