Asia cup 2023: ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. ట్రోఫీని ఎత్తుకున్న వ్యక్తి ఎవరో తెలుసా?

లంకేయులను ఓడించి ఆసియా కప్‌ 2023ను సొంతం చేసుకున్న భారత ఆటగాళ్ల వెంట ట్రోఫీని పట్టుకుని ఉన్న వ్యక్తి ఎవరనే సందేహం చాలా మందిలో మొదలైంది. ఇంతకీ అతడెవరంటే..  

Published : 18 Sep 2023 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ప్రత్యర్థిని ఓడించిన ఆటగాళ్లు ట్రోఫీని అందుకునేందుకు వేదికపైకి వెళుతుంటారు. అలాకాకుండా ఇతరులు కప్‌ను పట్టుకుని ఆటగాళ్లతో కలిసి కనిపించడం ఎప్పుడైనా చూశారా. కానీ, ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023)లో ఇదే జరిగింది. భారత్‌ ఆటగాళ్లతోపాటు మరో వ్యక్తి కప్‌ను పట్టుకుని నిల్చున్నాడు. ఇంతకీ అతను ఎవరో తెలుసా..

రోహిత్‌ శర్మ సారథ్యంలో శ్రీలంకను చిత్తు చేసి టీమ్‌ఇండియా ఆసియాకప్‌-2023 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ట్రోఫీని అందుకునే సమయంలో భారత ఆటగాళ్లతో పాటు ఒక కొత్త వ్యక్తి వేదికపై కనిపించడంతో అతడు ఎవరనే సందేహం చాలా మందిలో మొదలైంది. అతడు రఘు అని పిలుచుకునే టీమ్‌ఇండియా త్రోడౌన్‌ నిపుణుడు రాఘవేంద్రా (Raghavendraa). ప్రాకీస్ట్‌ సేషన్‌లో భారత్‌ ఆటగాళ్లకు ఎంతో సహకారం అందిస్తుంటాడు. అంతేకాకుండా జట్టుకు కావాలసిన వసతులు, సాధన చేయడంలో, హోటల్‌, టికెట్‌ బుకింగ్‌, ఆహారం ఇలా ఆటగాళ్లకు సంబంధించిన వ్యవహారాలను అతడే చూసుకుంటుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరచడం వెనుక రఘు పాత్ర ఎంతో ఉందనే చెప్పాలి. ఇతను 2011లో త్రోడౌన్‌ నిపుణుడిగా భారత్‌ జట్టులో చేరాడు. ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సిఫార్సు మేరకు రఘు జట్టులో అంతర్భాగమయ్యాడు.

సిరాజ్‌ మియా.. నీ మాయ అదిరిందయ్యా..!

ఇలా ఎవరైనా చేయగలరా..?: హర్భజన్‌

‘‘రఘు టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి.  ప్రాక్టీస్‌ సేషన్‌ సమయంలో జట్టులోని ప్రతి ఆటగాడికి తన సహకారం అందిస్తాడు. ఎల్లప్పుడు జట్టుకు అందుబాటులో ఉంటాడు. ఇతను ఒక కాలిపై ఎలా కూర్చున్నాడో చూడండి. ఇది ఎవరికైనా సాధ్యం అవుతుందా?’’ అని మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్(Harbhajan Singh) రఘును ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు. ఇదిలా ఉండగా.. గతేడాది టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో  రోహిత్‌ శర్మ స్వల్పంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న రఘు అతడికి సాయం చేశాడు. రోహిత్ త్వరగా కోలుకోవడంలో రఘు సాయపడ్డాడు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు