Hardik-Stokes: హార్దిక్‌Xబెన్‌ స్టోక్స్‌.. ఉత్తమ ఆల్‌రౌండర్‌.. కలిస్‌ ఏం చెప్పాడంటే?

హార్దిక్‌ పాండ్య, బెన్‌ స్టోక్స్‌.. వీరిద్దరిలో ఉత్తమ ఆల్‌రౌండర్‌ ఎవరనే అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ తన అభిప్రాయాలను వెల్లడించాడు.

Published : 02 Oct 2022 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత క్రికెటర్లలో ‘ఉత్తమ ఆల్‌రౌండర్‌’ ఎవరు అనే కొత్త చర్చ కొంతకాలంగా జరుగుతోంది. టీమ్‌ఇండియా నుంచి హార్దిక్‌ పాండ్య.. ఇటీవలే వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పేసిన ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు సారథి బెన్‌ స్టోక్స్‌.. ఒకరినొకరితో పోలుస్తూ క్రికెట్‌ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

ఈ క్రమంలో మాజీ టాప్‌ ఆల్‌రౌండర్‌, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్‌ కలిస్‌ కూడా దీనిపై స్పందించాడు. అలాగే భారత్, సౌతాఫ్రికా జట్లకు టీ20 ప్రపంచకప్‌లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే దానిపై విశ్లేషించాడు. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. కలిస్‌ కూడా ఇప్పుడు లెజెండ్స్ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో ఆడుతున్నాడు.

‘‘హార్దిక్‌, బెన్‌ స్టోక్స్‌ టాప్‌ క్లాస్‌ ఆటగాళ్లు. ప్రతిసారీ వారిద్దరినీ పోలుస్తూ ఉండాల్సిన అవసరం లేదు. అయితే వచ్చే టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ తమ జట్ల తరఫున కీలక పాత్ర పోషిస్తారు. వారి మధ్య పోరాటం బాగుంటుందని అనుకుంటున్నా. అలాగే భారత్‌, దక్షిణాఫ్రికా ఇప్పుడు ఆడుతున్న టీ20 సిరీస్‌లో పిచ్‌లు, మైదానాలు.. మెగా టోర్నీ జరిగే ఆసీస్‌ పిచ్‌లు వేర్వేరుగా ఉంటాయి. ఇరు జట్లూ మంచి ప్రదర్శనే ఇస్తాయి. దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా.. మాకు ఇదొక మంచి అవకాశం’’ అని కలిస్‌ తెలిపాడు. లెజెండ్స్‌ లీగ్‌లో దిగ్గజాలతో కలిసి ఆడటం సరదాగా ఉందని, చాలా ఆనందిస్తున్నట్లు చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని