Cricket News: అజ్జూ భాయ్‌ ప్రశ్నకు జవాబు తెలుసా?

1999 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా పోరులో మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ ఎవరో చెప్తారా? అని ప్రశ్నిస్తున్నాడు మహ్మద్‌ అజహరుద్దీన్‌. కఠిన పరిస్థితులు ఎదురైనా.. ఆటను మరుసటి రోజు కొనసాగించినా....

Published : 02 Jun 2021 01:11 IST

1999 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా పోరులో మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ ఎవరో చెప్తారా? అని ప్రశ్నిస్తున్నాడు మహ్మద్‌ అజహరుద్దీన్‌. కఠిన పరిస్థితులు ఎదురైనా.. ఆటను మరుసటి రోజు కొనసాగించినా.. అద్భుత విజయం సాధించామని గుర్తు చేసుకున్నాడు. ఈ మేరకు అతడో ట్వీట్‌ చేశాడు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-1999లో మే 30న టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌తో తలపడింది. సౌరవ్‌ గంగూలీ (40), రాహుల్‌ ద్రవిడ్‌ (53), అజయ్‌ జడేజా (39) రాణించడంతో భారత్‌ 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆంగ్లేయులను 169కే ఆలౌట్‌ చేసింది భారత్‌. దాదా తన మీడియం పేస్‌తో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనిల్‌ కుంబ్లే 10 ఓవర్లు విసిరి 2/30తో రాణించాడు. జవగళ్‌ శ్రీనాథ్‌ 8.3 ఓవర్లు విసిరి 25 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిశాక వాతావరణం సహకరించకపోవడంతో మ్యాచును మరుసటి రోజు కొనసాగించారు. తేమ, వాతావరణం ఉపయోగించుకొని బౌలర్లు రాణించారు.

‘ప్రపంచకప్‌-99లో మే 30న మేం ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించాం. మేం అత్యంత కఠిన పరిస్థితుల్లో పోరాడాం. మ్యాచ్‌ను మరుసటి రోజు కొనసాగించారు. తేమ, మబ్బులు, వాతావరణ పరిస్థితులను ఉపయోగించుకొని మా బౌలర్లు రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎవరికిచ్చారో గుర్తుందా?’ అని అజ్జూ ట్వీట్‌ చేశాడు.  గంగూలీకే మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ రావడం గమనార్హం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని