విరాట్‌ అనుష్క గొడవ పడితే..!

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్కశర్మ ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసో? ఇద్దరిలో ఎవరు బెటరో? తెలుసుకుందామని ప్రయత్నించారు. ‘టేక్‌ ఏ బ్రేక్‌’ పేరుతో మూడు రౌండ్లు పెట్టుకున్న ఈ పోటీలో తమ వృత్తులు, ఇష్టాఇష్టాల గురించి...

Published : 12 Aug 2020 18:24 IST

మొదట ఎవరు క్షమాపణ అడుగుతారో తెలుసా?

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్కశర్మ ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసో? ఇద్దరిలో ఎవరు బెటరో? తెలుసుకుందామని ప్రయత్నించారు. ‘టేక్‌ ఏ బ్రేక్‌’ పేరుతో మూడు రౌండ్లు పెట్టుకున్న ఈ పోటీలో తమ వృత్తులు, ఇష్టాఇష్టాల గురించి ప్రశ్నలు సంధించుకున్నారు. అయితే వాటి ద్వారా కొన్ని సరదా సంగతులూ బయటపడ్డాయి. అవేంటంటే..!

తొలిరౌండ్లో  తమ వృత్తుల గురించి ప్రశ్నించుకున్నారు. భారత్‌లో నిర్మించిన తొలి హిందీ ఫీచర్‌ ఫిల్మ్‌ ఏదని అనుష్క ప్రశ్నించగా విరాట్‌ నోరెళ్లబెట్టాడు. ఏదో ప్రయత్నించి ‘మేరా అంజాన్‌’ అని చెప్పాడు. అయితే ‘రాజా హరిశ్చంద్ర’ (1913) సరైన సమాధానమని అనుష్క చెప్పింది. ఆ తర్వాత క్రికెట్‌ నేపథ్యంలో వచ్చిన రెండు సినిమాల పేర్లు అడగ్గానే ‘లగాన్‌’, ‘పటియాలా హౌజ్’ అని ఠక్కున చెప్పేశాడు విరాట్‌. అయితే క్రికెట్‌లో మూడు ప్రాథమిక నిబంధనలు అడగ్గా.. ‘ఔటవ్వొద్దు’, ‘ఆటను వదిలేయొద్దు’ అని అనుష్క నవ్వుతూ బదులిచ్చింది. ఆ తర్వాత సరైన సమాధానాలు చెప్పింది. మహిళల క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌ ఎవరని అడగ్గా.. ‘జులన్‌ గోస్వామి’ అని ఠక్కున చెప్పేసింది.

ఇక వ్యక్తిగతానికి వస్తే ఒకరినొకరు సంతోషంగా ఉంచడానికి ఏం చేస్తారు? ఫలానా తేదీన ఎక్కడికి వెళ్లాం? వంటి ప్రశ్నలు అడిగారు. ‘నన్ను ఎవరు సంతోషంగా ఉంచుతారు?’ అని అనుష్క అడగ్గా ‘మూగజీవులు’ అని కోహ్లీ చెప్పాడు. అయితే ‘నువ్వు కదా నన్ను సంతోషంగా ఉంచేది’ అని ఆమె అనగా అవును కదా! అని విరాట్‌ అన్నాడు. ఇక సినిమాలకు వెళ్తే ఎవరు నిద్రపోతారు? అంటే తానేనని కోహ్లీ చెప్పాడు. ఇద్దరూ గొడపడితే ముందుగా తానే క్షమాపణ చెబుతానని, ఇద్దరూ పోట్లాడుకుంటే ‘కోహ్లీ’ ఘోరంగా ఓడిపోతాడని అనుష్క చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని