Updated : 09/08/2021 15:58 IST

Neeraj chopra:  నీరజ్‌ చోప్రా.. నీకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో వందేళ్ల నిరీక్షణకు తెరదించుతూ నీరజ్‌ చోప్రా సరికొత్త అధ్యయాన్ని లిఖించాడు. అయితే, మనకు ఒలింపిక్స్‌ గోల్డ్  మెడలిస్ట్‌గా మాత్రమే తెలిసిన నీరజ్‌ చోప్రాలో ఆసక్తికర విషయాలు ఎన్నో దాగివున్నాయి. తాజాగా అతడి అత్యంత సన్నిహితుడు అథ్లెట్‌ తేజస్విని శంకర్‌ ఎవరికీ తెలియని కొన్ని విషయాలను రాసుకొచ్చాడు.

‘బెంగుళూరులో రెండు వారాల పాటు చోప్రాతో కలిసి ఒక గదిని పంచుకున్నాను. అతడిప్పుడు ఒలింపిక్ ఛాంపియన్ కావచ్చు. కానీ, అతడితో ఒక గదిని పంచుకోవడానికి నేను భయపడతాను. ఎందుకంటే, గదిలో తన బట్టలన్నీ చిందరవందరగా పడేస్తాడు. గది మధ్యలో సాక్స్‌ను ఆరబెడతాడు. తను చేసే పనులు ఇబ్బంది కలిగించినా నేను ఎప్పుడు అతనితో చెప్పలేదు. ఆ పదిహేను రోజుల పాటు మేమిద్దరం ఫ్రైడ్ రైస్, మట్కా కుల్ఫీని ఇష్టంగా తిన్నాం. అతడికి ‘మినీ మిలీషియా’ అనే వీడియో గేమ్ అంటే పిచ్చి. కానీ, ఇప్పుడు పబ్‌జీ ఆడడానికి మక్కువ చూపెడుతున్నాడు. అతడ్ని మళ్లీ కలిసినపుడు తనకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉందా అని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను’ అని శంకర్ రాశాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని