ZIM vs IND: జింబాబ్వేతో టీ20 సిరీస్.. టీమ్ ఇండియా ఆటగాళ్ల జెర్సీపై ఒకే స్టార్.. కారణమిదే

జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత ఆటగాళ్ల జెర్సీపై ఒక స్టార్ మాత్రమే ఉంది. ఇటీవల రెండో టీ20 వరల్డ్ కప్‌ సాధించిన టీమ్‌ఇండియా జింబాబ్వేతో మ్యాచ్‌లో ఒకే స్టార్ ఉన్న జెర్సీని ధరించింది. 

Published : 06 Jul 2024 20:51 IST

ఇంటర్నెట్ డెస్క్: అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 116 పరుగుల లక్ష్యఛేదనలో 102 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ధరించిన జెర్సీపై ఒకే స్టార్‌ ఉంది. ఇటీవల భారత్‌ రెండవ టీ20 ప్రపంచకప్‌ను సాధించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందే భారత ఆటగాళ్లు జింబాబ్వే చేరుకున్నారు. దీంతో ఇది వరకే సిద్ధం చేసిన జెర్సీలతో జింబాబ్వేకు వెళ్లారు. బార్బడోస్ నుంచి భారత ప్రపంచ కప్‌ జట్టు స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. భారత్ రెండో టీ20 ప్రపంచ కప్ సాధించడంతో దానికి చిహ్నంగా రెండు స్టార్లు ఉన్న జెర్సీని సంజు శాంసన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. భారత ప్రపంచ కప్‌ జట్టు ప్రధాని మోదీని కలిసినప్పుడు ఛాంపియన్స్‌ అని రాసి ఉన్న జెర్సీలపై కూడా రెండు స్టార్లు ఉన్నాయి. వచ్చే సిరీస్‌ నుంచి.. రెండు టీ20 ప్రపంచ కప్‌లకు  ప్రతీకగా రెండు స్టార్లు కలిగిన జెర్సీలను టీమ్ ఇండియా ఆటగాళ్లు ధరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని