IND vs AUS: ఆసీస్‌తో నాలుగో టెస్టు.. శ్రేయస్‌ అయ్యర్‌కు ఏమైంది?

టీమ్‌ఇండియా (Team India) మిడిలార్డర్‌ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer) తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో అతడికి ఏమైందోననే ఆందోళన అభిమానుల్లో రావడంతో బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

Published : 12 Mar 2023 12:13 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar trophy) భాగంగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల (IND vs AUS) మధ్య చివరి టెస్టు జరుగుతోంది. ప్రస్తుతం నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. టీమ్‌ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌ను ఆడుతోంది. అయితే, భారత మిడిలార్డర్‌ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్ పరిస్థితేంటో అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది. సాధారణంగా నాలుగో డౌన్‌లో శ్రేయస్‌ అయ్యర్ బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ, ఛెతేశ్వర్ పుజారా పెవిలియన్‌కు చేరిన తర్వాత కూడా అయ్యర్ బ్యాటింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో ఎడమ చేతివాటం బ్యాటర్ రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వెళ్లాడు. సరే లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌ కోసం ప్రయత్నించి ఉండొచ్చని అభిమానులు భావించారు. అయితే, జడ్డూ ఔటైన తర్వాత కూడా శ్రేయస్‌ బ్యాటింగ్‌కు దిగలేదు. అతడి స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్ క్రీజ్‌లోకి వచ్చాడు. దీంతో అయ్యర్‌కు ఏమైందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా అప్‌డేట్‌ ఇచ్చింది. 

‘‘శ్రేయస్‌ అయ్యర్‌ లోయర్ బ్యాక్‌ (వెనుక నడుము వద్ద) నొప్పిగా ఉన్నట్లు మా దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో అతడిని స్కానింగ్‌ కోసం పంపించాం. బీసీసీఐ వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తోంది’’ అని బీసీసీఐ వెల్లడించింది. అయితే, అయ్యర్ బ్యాటింగ్‌కు వస్తాడా..? లేదా..? అనే విషయంపైనా క్లారిటీ ఇవ్వలేదు. శ్రేయస్‌ అయ్యర్ ఇలానే తొలి టెస్టులోనూ ఆడలేకపోయాడు. రెండు, మూడో టెస్టుల్లో ఆడినప్పటికీ పెద్దగా రాణించలేకపోయాడు.

ఆసీస్‌తో నాలుగో టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 362/4 (131)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని