GT vs CSK: గుజరాత్‌తో తొలి మ్యాచ్.. ధోనీ అందుబాటులో ఉంటాడా..? లేదా..?
ఇవాళ సాయంత్రం ఐపీఎల్ ( IPL 2023) 16వ సీజన్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల (GT vs CSK) మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ (IPL 2023) 16వ సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. సినీ తారలు తమన్నా భాటియా, రష్మిక మంధాన ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అతిపెద్ద మైదానం నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల (GT vs CSK) మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అరంగేట్రం చేసిన తొలి ఏడాదే కప్‌ను సొంతం చేసుకున్న హార్దిక్ పాండ్య నాయకత్వంలోని గుజరాత్ మరోసారి టైటిల్‌పై కన్నేసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే నాలుగుసార్లు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఐదు టైటిళ్లను గెలిచిన ముంబయితో సమంగా నిలిచేందుకు ఎంఎస్ ధోనీకి ఇదొక అవకాశం. అయితే గుజరాత్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు ధోనీ అందుబాటులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధోనీ స్వల్ప గాయం బారిన పడినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ టైటిల్‌తో దిగిన ఫొటోషూట్‌లో ధోనీ (MS Dhoni) ఉన్నాడు. ప్రాక్టీస్ సందర్భంగా అతడు స్వల్పంగా గాయపడినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఒకవేళ మొదటి మ్యాచ్‌లో ధోనీ ఆడకపోతే రవీంద్ర జడేజా జట్టును నడిపించే అవకాశం ఉంది. అయితే, సీఎస్‌కే ఫ్రాంచైజీ సీఈవో మాత్రం ధోనీ ఆడతాడనే భరోసా ఇచ్చారు. ఇక జట్టు సభ్యుల విషయానికొస్తే.. మినీ వేలంలో భారీ ధరను (రూ. 16.25 కోట్లు) వెచ్చించి మరీ బెన్ స్టోక్స్‌ను సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఆల్‌రౌండ్ పాత్రను పోషిస్తాడని భావిస్తోంది. గతేడాది గాయం కారణంగా టోర్నీకి దూరమైన దీపక్ చాహర్ రావడంతో చెన్నై బౌలింగ్ విభాగం పటిష్ఠంగా మారనుంది. ఓపెనర్లుగా డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం దాదాపు ఖాయం. అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్ మిడిలార్డర్‌లో కీలకమవుతారు. పేసర్ ముకేశ్ చౌదరి గాయం కారణంగా టోర్నీనుంచి వైదొలిగాడు. మిస్టరీ స్పిన్నర్ మహీశ్ తీక్షణ తన ఫామ్‌ను కొనసాగించేందుకు ఆత్రుతగా ఉన్నాడు.
కేన్‌కు అవకాశం..! (Kane Williamson)
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఈసారి సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది. గతేడాది సమష్ఠిగా రాణించి మరీ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఇదే పోరాటంతో ముందుకు సాగాలని హార్దిక్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. గతేడాది కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం సీజన్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఇక మినీ వేలంలో కేన్ విలియమ్సన్‌ను దక్కించుకున్న గుజరాత్.. అతడికి అవకాశం ఇస్తుందో లేదో వేచి చూడాలి. ఓడియన్ స్మిత్, కేఎస్ భరత్, జాషువా లిటిల్, శుభ్‌మన్ గిల్, రాహుల్ తెవాతియా, వృద్ధిమాన్ సాహా బ్యాటింగ్‌లో కీలకం. ఇక బౌలింగ్ విభాగంలో పాండ్యతోపాటు అల్జారీ జోసెఫ్, జయంత్ యాదవ్, రషీద్ ఖాన్, సాయికిశోర్, శివమ్ మావి రాణిస్తే గుజరాత్‌కు తిరుగుండదు.
తుది జట్లు (అంచనా): (Teams)
గుజరాత్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, మ్యాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, శివమ్ మావి,
చెన్నై: డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, సిమర్‌జీత్ సింగ్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Vivek: చైనాలో ఎలాన్ మస్క్ పర్యటన ఆందోళనకరమే : వివేక్ రామస్వామి
-
Crime News
Vijayawada: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం.. కృష్ణానదిలో దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
-
India News
Supreme Court: రూ.2వేల నోట్ల మార్పిడిపై పిటిషన్.. అత్యవసర విచారణకు సుప్రీం ‘నో’!
-
Movies News
Samantha: విజయ్.. నీ కష్టసుఖాలు నేను చూశా: సమంత
-
India News
Bhagwant Mann: ‘మా పోలీసులు చూసుకోగలరు’: జెడ్ ప్లస్ భద్రత వద్దన్న సీఎం
-
General News
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు