NZ vs IND: మిగిలింది ఒకటే టీ20.. మరి తుది జట్టులో చోటు కోసం ఇద్దరు సిద్ధం..!

న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ సొంతం చేసుకొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. మంగళవారం చివరి మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో తుది జట్టులో ఎవరుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తిగా ఉంది.

Published : 21 Nov 2022 20:36 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఆడుతోన్న తొలి సిరీస్‌పై భారత్‌ కన్నేసింది. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో భారత్‌ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం చివరి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఇందులో విజయం సాధిస్తే సిరీస్ 2-0 తేడాతో టీమ్‌ఇండియా కైవసం చేసుకొంటుంది. ఒకవేళ ఓడినా 1-1తో సమంగా నిలుస్తుంది. ఈ క్రమంలో భారత్ తన తుది జట్టులో ఎవరిని తీసుకొంటుందనే ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ ఉంది. 

గత టీ20 ప్రపంచకప్‌లో తుది జట్టులో అవకాశాలు రాని  మహమ్మద్‌ సిరాజ్‌, యుజ్వేంద్ర చాహల్‌ కివీస్‌తో రెండో టీ20లో ఆడేశారు. మెగా టోర్నీలో ఒకటీ అరా ఛాన్స్‌లను మాత్రమే దక్కించుకొన్న దీపక్ హుడా.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌గా అదరగొట్టేశాడు. ఈ సిరీస్‌లో తప్పక చోటు దక్కుతుందని భావించిన ఆటగాళ్లు సంజూ శాంసన్, ఉమ్రాన్‌ మాలిక్‌. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం వీరిద్దరికి ఛాన్స్‌ రాలేదు. కనీసం చివరి టీ20లోనైనా అవకాశం వస్తే సత్తా నిరూపించుకోవాలని తహతహలాడుతున్నారు. టీమ్‌ఇండియా తరఫున నిలకడగా 150 కి.మీ వేగంతో బంతులను సంధించే ఉమ్రాన్‌కు అవకాశం ఇవ్వకపోతే మాత్రం అతడిని న్యూజిలాండ్‌కు పిలిపించి ప్రయోజనం లేదు. ఓపెనర్‌గా రిషభ్‌ పంత్ ఆకట్టుకోలేకపోయాడు. అతడి స్థానంలో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టేందుకు ఇషాన్‌తోపాటు సంజూ శాంసన్‌ను పంపిచాలని మాజీలు సూచిస్తున్నారు. 

‘‘చివరి మ్యాచ్‌లో ఏమేమి మార్పులు ఉంటాయనేది నాకూ తెలియదు. ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. అయితే ఒకటే మిగిలి ఉన్న నేపథ్యంలో కాస్త కష్టతరంగానే ఉంది’’ అని రెండో మ్యాచ్ అనంతరం హార్దిక్‌ చెప్పిన మాటలివి.. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని