ఐపీఎల్‌ రేసులోకి పతంజలి!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ రేసులోకి కొత్తగా రాందేవ్‌ బాబా‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పతంజలి సంస్థ దూసుకొచ్చింది. తమ బ్రాండ్‌ను విదేశాల్లో విస్తరించేందుకు ఐపీఎల్‌ ఉపయోగపడగలదని ఆ సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. ఆయుర్వేద ఆధారిత ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను...

Published : 11 Aug 2020 02:18 IST

ట్విటర్‌లో భారీగా ట్రెండ్‌ అవుతున్న #PatanjaliIPL 

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ రేసులోకి కొత్తగా రాందేవ్‌ బాబా‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పతంజలి సంస్థ దూసుకొచ్చింది. తమ బ్రాండ్‌ను విదేశాల్లో విస్తరించేందుకు ఐపీఎల్‌ ఉపయోగపడగలదని ఆ సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. ఆయుర్వేద ఆధారిత ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను విదేశాలకు ఎగమతి చేయాలని పతంజలి చాలాకాలంగా యోచిస్తోంది.

యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌-2020 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీసీసీఐ స్టాండింగ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను ప్రకటించింది. భారీ నియమావళిని ఫ్రాంచైజీలకు అందజేసింది. ఆటగాళ్లు సైతం ఇంటి వద్ద, సమీపంలోని మైదానాల్లో సాధన చేస్తున్నారు. అయితే చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగుతున్న వివో మొబైల్‌ ఈ ఏడాదికి ఒప్పందం రద్దు చేసుకుంది. భారీఎత్తున వ్యతిరేకత రావడంతో విముఖత చూపించింది. దాంతో ఫ్రాంచైజీలు, బీసీసీఐ కలిసి దాదాపు రూ.440 కోట్ల వరకు నష్టపోనున్నాయి.

త్వరలోనే టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించనుంది. అమెజాన్‌, బైజుస్‌, డ్రీమ్‌ 11, అన్‌అకాడమీ వంటి కంపెనీలు ఇందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిసింది. రాబోయే దసరా, దీపావళి పండగల సీజన్‌ కోసం ఈ అవకాశం అందుకోవాలని అమెజాన్‌ గట్టి పట్టుదలతో ఉంది. ఇతర సంస్థలను మించి అధికంగా టెండరు వేసే సామర్థ్యం ఆ సంస్థకు ఉంది! ఇప్పుడు పతంజలి సైతం రావడంతో పోటీ ఎక్కువైంది. అయితే ఎవరు ఎంత మొత్తానికి టెండర్‌ వేస్తారన్నది ఆసక్తికరం. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఎవరూ రూ.200 కోట్లకు మించి చెల్లించకపోవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో #PatanjaliIPL భారీగా ట్రెండ్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు