Kaneria: ఆ టీమ్ఇండియా బ్యాటర్‌ అందరినీ అధిగమిస్తాడు.. పాక్‌ మాజీ స్టార్‌ ప్రశంసలు

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో చేజిక్కించుకుంది. యువ సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) మరోసారి చెలరేగి భారత్‌కు విజయాన్ని దగ్గర చేశాడు..........

Published : 28 Sep 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో చేజిక్కించుకుంది. యువ సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) మరోసారి చెలరేగి భారత్‌కు విజయాన్ని దగ్గర చేశాడు. ఉప్పల్‌ వేదికగా జరిగిన ఈ నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో 36 బంతుల్లోనే అతడు 69 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే సూర్యను పలువురు అభినందించారు. ఈ జాబితాలోకి పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు డానిష్‌ కనేరియా వచ్చి చేరాడు. సూర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. అతడు అందరినీ అధిగమించి ఆల్‌టైం గ్రేటెస్ట్‌ బ్యాటర్‌గా ఎదుగుతాడని వ్యాఖ్యానించాడు.

‘సూర్య కుమార్‌ అత్యుత్తమ బ్యాటర్‌‌. భిన్నమైన శైలితో తన ఆటను కొనసాగిస్తున్నాడు. 360 డిగ్రీల్లో షాట్లు కొట్టగల సమర్థుడు. మూడో టీ20లో అత్యద్భుతంగా ఆడాడు. కచ్చితంగా చాలా పెద్ద ప్లేయర్‌ అవుతాడు. అతడు బ్యాటింగ్ చేసే విధానం  ఇతర దిగ్గజాలను మైమరపించేలా ఉంది. కోహ్లీ ఎన్నో పరుగులు చేస్తాడు. బాబర్ విజయవంతమవుతాడు.. కానీ యాదవ్ అందరినీ వెనక్కినెడతాడు’ అంటూ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో కనేరియా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా కోహ్లీని సైతం ప్రశంసించాడు. ఓపెనర్లు త్వరగా ఔటైనా.. సూర్యతో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడని పేర్కొన్నాడు. ‘కోహ్లీ ఆడమ్‌ జంపాకి దొరికిపోతాడని అందరూ అంటారు. కానీ ఈ మ్యాచ్‌లో అతడిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. రోహిత్‌, రాహుల్‌ త్వరగా ఔటైన తర్వాత మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూర్యకు మార్గనిర్దేశం చేస్తూ మ్యాచ్‌ను ముందుకు నడిపించాడు. ఈ జోడీకి ఆస్ట్రేలియా బౌలర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ ఇద్దరు ఇలాగే రాణిస్తే టీ20 ప్రపంచకప్‌లో ప్రతి జట్టుపై భారత్‌ ఆధిపత్యం చలాయిస్తుంది’ అని కనేరియా అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు